Balakrishna, Gopichand: బాలయ్య గోపీచంద్ మూవీకి సమస్య ఇదేనా?

స్టార్ హీరో బాలకృష్ణ స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతుండగా త్వరలో ఈ సినిమాకు జై బాలయ్య అనే టైటిల్ ను అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ పోషిస్తుండగా బాలయ్య ఒక పాత్రకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తైందని సమాచారం అందుతోంది. బాలయ్య మరో పాత్ర షూటింగ్ ను విదేశాల్లో చేయాల్సి ఉండగా అమెరికాలో కొన్ని సన్నివేశాలను షూట్ చేయాలని చిత్రయూనిట్ భావించింది.

అయితే అమెరికాలో షూట్ కు సంబంధించి వీసా సమస్యలు ఎదురయ్యాయని అందువల్ల ఆ సన్నివేశాలను టర్కీలో షూట్ చేయాలని చిత్రయూనిట్ భావిస్తోందని తెలుస్తోంది. వీసా సమస్య ఎదురుకాకుండా ఉండి ఉంటే అమెరికాలోనే చిత్రయూనిట్ అనుకున్న విధంగా షూట్ జరిగి ఉండేది. బాలయ్యకు జోడీగా ఈ సినిమాలో శృతి హాసన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. శృతి హాసన్ కు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉండగా క్రాక్ సినిమాతో గతేడాది సక్సెస్ ను సొంతం చేసుకున్న శృతి హాసన్ ప్రస్తుతం వరుస సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్నారు.

బాలయ్య సినిమాలో తన రోల్ స్పెషల్ గా ఉంటుందని శృతి హాసన్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. అయితే ఆమె రోల్ ఎలా ఉండబోతుందో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బాలయ్య శృతి కాంబోలో తెరకెక్కుతున్న తొలి సినిమా ఇదే కావడం గమనార్హం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఈ సినిమా కోసం 70 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఖర్చు చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

అఖండ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించడంతో మేకర్స్ ఖర్చు విషయంలో రాజీ పడటం లేదని సమాచారం అందుతోంది. దసరా కానుకగా ఈ సినిమా రిలీజయ్యే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus