సినిమాలో హీరో అన్యాయాన్ని అస్సలు సహించడు.. తప్పు చేసినవాడి పంబ రేగ్గొడతాడు. ఇంటర్వెల్‌కి వచ్చేసరికి ఆ హీరో కుటుంబానికి అనుకోని కష్టం వస్తుంది. అప్పుడు అలాగే ఉండే మరో హీరో తెర మీదకు వస్తారు. దుమ్మురేగ్గొడతాడు. సెకండాఫ్‌లో ఆ రెండో హీరో గురించి చెప్పి, ఏం చేశాడో చూపించి కథ ముగించేస్తాడు. ఈ కథ ఎక్కడో చూసినట్లుంది కదా. ఒకసారి కాదు మూడు సార్లు చూసినట్లుంది కదా. అలాంటి కథ నాలుగోసారి చూపించడానికి రంగం సిద్ధమవుతోందట.
పైన చెప్పిన కథ నందమూరి బాలకృష్ణ రీసెంట్ హిట్ సినిమాలదే అనే విషయం మీకు తెలుసు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఆడియన్స్ పల్సు. అందుకే అదే కథ రిపీట్సు. ‘అఖండ’ విజయం తర్వాత బాలయ్య మరోసారి అలాంటి కాన్సెప్ట్‌కే ఓకే చెప్పాడట. అయితే ఈసారి దర్శకుడు మారుతున్నాడు. ఇప్పటివరకు పై తరహా కథలతో అలరించింది బోయపాటి శ్రీను. ఇప్పుడు ఆ పని చేయబోతోంది గోపీచంద్ మలినేని. అవును గోపీచంద్‌తో బాలయ్య చేస్తున్న కథ అలానే ఉంటుందట.
గోపీచంద్ మలినేని – మైత్రీ మూవీ మేకర్స్ కాంబోలో బాలయ్య ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా వేటపాలెం నేపథ్యంలో ఉంటుందని ఆ మధ్య వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా రాయలసీమ నేపథ్యంలో ఉంటుందంటున్నారు. ఒక హీరో పట్నంలో ఉంటే, ఒరిజినల్ అంటే పవర్‌ఫుల్ హీరో సీమలో ఉంటాడట. అక్కడ అన్యాయాన్ని చీల్చిచెండాడే వీరుడు అతడట. ఈ ఇద్దరి కథనే ఇప్పుడు బాలయ్య చేస్తున్నాడట.
రాయలసీమలో పెద్ద ఫ్యాక్టరీ పెట్టడానికి ఆ మధ్య ఓ సంస్థ ముందుకొచ్చి తర్వాత వెనకడుగేసింది. ఆ నేపథ్యాన్ని, ప్రస్తుత రాజకీయాన్ని కలుపుకొని ఈ సినిమా కథను గోపీచంద్ మలినేని సిద్ధం చేస్తున్నారట. అంతేకాదు ఈ సినిమాకు ‘పెద్దాయన’ అనే పేరు అనుకుంటున్నారట. దానికి ఓ కారణం కూడా ఉందట. ఆ సినిమాలో రెండో బాలయ్య పాత్రను ఊళ్లో పెద్దాయన అని పిలుస్తుంటారట. ఆ పాత్ర వయసు 60 ఏళ్లు ఉంటుందని టాక్. అయితే ఇందులో ఎంతవరకు నిజాలున్నాయనేది తెలియాల్సి ఉంది.
Most Recommended Video
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!