Balakrishna: నిద్రాహారాలు మాని ఆస్పత్రికే పరిమితమైన బాలయ్య.. గ్రేట్ అంటూ?

  • January 30, 2023 / 05:02 PM IST

టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ గురించి కొన్ని విమర్శలు ఉన్నా బాలయ్య మనస్సు బంగారం అని ఆయనతో ఉన్నవాళ్లు చెబుతారనే సంగతి తెలిసిందే. తారకరత్న ప్రస్తుతం బెంగళూరులోని ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే తారకరత్న పూర్తిస్థాయిలో కోలుకోవడం కోసం బాలయ్య రేయింబవళ్లు ఆస్పత్రికే పరిమితమయ్యారు. బాలయ్య తన సినిమా షూటింగ్ లను సైతం పోస్ట్ పోన్ చేసుకున్నారని సమాచారం. బాబాయ్ కోసం బ్రతికిరా అన్న అంటూ బాలయ్య ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా చేస్తున్న కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నిద్రాహారాలు మాని ఆస్పత్రికే పరిమితమైన బాలయ్య గ్రేట్ అని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. తనకు ఎన్ని బిజీ షెడ్యూల్స్ ఉన్నా తారకరత్నకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు బాలయ్య తెలుసుకుంటూ ఆ విషయాలను మీడియాకు తెలియజేస్తున్నారు. తారకరత్న ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని అయితే ఆయన ఆరోగ్యం పూర్తిస్థాయిలో కోలుకోవాలంటే కొంత సమయం పడుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. తారకరత్న కోలుకోవాలని తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ప్రార్థనలు జరుగుతున్నాయి.

వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తిగా తారకరత్నకు పేరుంది. తారకరత్న వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి అని ఫ్యాన్స్ భావిస్తారు. తారకరత్న ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న నటుడు అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తారకరత్న కుటుంబ సభ్యులను బాలయ్య ఓదార్చుతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలయ్య ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు.

బాలయ్య అనిల్ కాంబో మూవీ ఈ ఏడాది సెకండాఫ్ లో థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా కాజల్, హనీరోజ్ నటిస్తారని సమాచారం అందుతోంది. 80 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus