Balakrishna,Parasuram: బాలయ్య ఖాతాలో పరశురామ్ కూడా ఉన్నారా?

గత రెండేళ్లలో బాలయ్య హీరోగా నటించి విడుదలైన సినిమా అఖండ మాత్రమే అనే సంగతి తెలిసిందే. బాలయ్య నటించిన రూలర్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. మరోవైపు కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వల్ల అఖండ మూవీ షూటింగ్ అంతకంతకూ ఆలస్యమైంది. అఖండ సినిమాలో ఫైట్ సీన్లను మాత్రమే దర్శకుడు బోయపాటి శ్రీను 80 రోజుల పాటు షూట్ చేయడం వల్ల సినిమా రిలీజ్ ఆలస్యమైంది.

అయితే అఖండ సినిమా రిలీజైన తర్వాత అంచనాలను మించి కలెక్షన్లు సాధించి పాజిటివ్ టాక్ వస్తే బాలయ్య సినిమా కొత్త రికార్డులు క్రియేట్ చేయడం సాధ్యమని ప్రూవ్ చేసింది. అఖండ సక్సెస్ తర్వాత బాలయ్య వరుసగా భవిష్యత్తు ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇప్పటికే బాలయ్య హీరోగా గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సినిమాలు తెరకెక్కనున్నట్టు అధికారిక ప్రకటనలు వచ్చేశాయి. నిన్నటినుంచి కొత్త బంగారు లోకం డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల బాలయ్యకు కథ చెప్పి ఓకే చేయించుకున్నారని ప్రచారం జరిగింది.

మరోవైపు దర్శకుడు పరశురామ్ కూడా బాలయ్యకు కథ చెప్పి ఓకే చేయించుకున్నారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. దర్శకుడు పరశురామ్ ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాతో పాటు నాగచైతన్య హీరోగా పరశురామ్ డైరెక్షన్ లో ఒక సినిమా తెరకెక్కనుంది. పరశురామ్ చెప్పిన లైన్ కొత్తగా ఉండటంతో బాలయ్య వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. త్వరలో ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది.

బాలయ్య తర్వాత సినిమాల డైరెక్టర్ల జాబితాలో కొరటాల శివ కూడా ఉన్నారు. ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలు తెరకెక్కి రిలీజయ్యేలా బాలయ్య కెరీర్ ను ప్లాన్ చేసుకుంటూ ఉండటం గమనార్హం. బాలయ్యకు సినిమాసినిమాకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అంతకంతకూ పెరుతోంది. ఆరు పదుల వయస్సులో కూడా బాలయ్య ఉత్సాహంగా సినిమాలలో నటిస్తున్నారు.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus