Balakrishna: టికెట్ల జీవో రద్దుపై బాలయ్య రియాక్షన్ ఇదే!

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ సినిమాల హవా కొనసాగుతోంది. వెంకటేష్, నాగార్జున వరుసగా మల్టీస్టారర్ సినిమాలలో నటిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సైతం తన సినిమాలు మల్టీస్టారర్ గా తెరకెక్కేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే బాలయ్య మాత్రం మల్టీస్టారర్ సినిమాలకు దూరంగా ఉన్నారనే సంగతి తెలిసిందే. అయితే తాజాగా మీడియాతో మాట్లాడిన బాలయ్య మల్టీస్టారర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా విజయవాడ కనకదుర్గ అమ్మవారిని బాలయ్య దర్శించుకున్నారు.

అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన బాలయ్య మీడియాతో మాట్లాడుతూ అఖండ మూవీ అఖండమైన సక్సెస్ సాధించిందని చెప్పుకొచ్చారు. ప్రేక్షకులు ఫ్యామిలీతో కలిసి అఖండ సినిమాకు రావడం తనకు సంతోషం కలిగించిందని బాలయ్య చెప్పుకొచ్చారు. సీనియర్ ఎన్టీఆర్ ఆనాడు భక్తిని కాపాడారని ప్రస్తుతం అఖండ మూవీ సనాతన ధర్మాన్ని కాపాడిందని బాలయ్య చెప్పుకొచ్చారు. అఖండ సినిమాను ఆదరించిన ప్రేక్షక దేవుళ్లకు కృతజ్ఞతలు అని బాలయ్య వెల్లడించారు. అమ్మవారి ఆశీస్సుల వల్ల అఖండ మూవీ దిగ్విజయంగా ప్రదర్శించబడుతోందని బాలయ్య పేర్కొన్నారు.

అఖండ రిజల్ట్ తో ప్రేక్షకులు మంచి సినిమాలను ఆదరిస్తారని మరోసారి ప్రూవ్ చేశారని బాలయ్య చెప్పుకొచ్చారు. సినిమా మంచిగా వచ్చిందని అఖండ రిలీజ్ విషయంలో డేర్ స్టెప్ వేశామని బాలయ్య తెలిపారు. మంచి కథ వస్తే మల్టీస్టారర్ సినిమాలకు సిద్ధమేనని బాలయ్య ప్రకటించారు. అయితే బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో మల్టీస్టారర్ వస్తుందో లేదో చూడాల్సి ఉంది. టికెట్ల వ్యవహారంపై గతంలో మాట్లాడానని ప్రభుత్వం అప్పీల్ కు వెళ్తానంటోందని ఏం జరుగుతుందో చూద్దామని బాలయ్య పేర్కొన్నారు.

బాలయ్య తర్వాత మూవీ గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కనుంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలయ్యకు జోడీగా ఈ సినిమాలో శృతిహాసన్ నటిస్తున్నారు. క్రాక్ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. వరుసగా కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బాలయ్య కెరీర్ పరంగా బిజీ అయ్యే దిశగా అడుగులు వేస్తుండటం గమనార్హం.

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!

Most Recommended Video

మహేష్ టు నవీన్… ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన హీరోల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!
అఘోరా గెటప్‌ టాలీవుడ్‌ హీరోలకు కలిసొచ్చిందా!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus