తేజపై అసంతృప్తిగా ఉన్న బాలకృష్ణ

తేజ దర్శకత్వంలో మహానటుడు ఎన్టీఆర్ బయోపిక్ సినిమా రూపుదిద్దుకోనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని బాగా తెరకెక్కించడానికి తేజ .. తాను వెంకటేష్ తో చేస్తున్న సినిమాని తొందరగా కంప్లీట్ చేయాలనీ భావిస్తున్నారు. అయితే ఎన్టీఆర్ బయోపిక్ కి డైరక్టర్ ని మార్చాలని బాలయ్య చూస్తున్నట్టు తెలిసింది. ఈ వార్త ఫిలిం నగర్లో హాట్ న్యూస్ అయింది. కారణం ఏమిటని ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. ఎన్టీఆర్ బయోపిక్ టీజర్ ను జనవరి 18న రిలీజ్ చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. అయితే ఆరోజు ప్రీ లుక్ మాత్రమే వచ్చింది. నిజానికి ఆ రోజు టీజర్ రిలీజ్ చేయడానికి రామకృష్ణ సినీ స్టూడియోస్ లో బాలకృష్ణపై మూడు రోజుల పాటు షూట్ కూడా చేసారు. చైతన్య రథంపై వెనుక నుంచి ఎన్టీఆర్ మాదిరిగా బాలయ్య కనిపిస్తారు. జనం ఉంటారు.

ఖాకీ డ్రెస్ వేసుకున్న ఎన్టీఆర్ మాదిరిగా “మా తెలుగింటి ఆడపడుచులకు వందనం.. అభివందనం” అనే డైలాగు బాలయ్య చెబుతారు. ఈ వీడియో ఎడిటింగ్ కూడా జరిగింది. ఈ టీజర్ చూసిన తర్వాత బాలకృష్ణ షాక్ తిన్నారంట. ఏ విధంగానూ బాగాలేకపోవడంతో టీజర్ ని చెత్తబుట్టలో పడేయమని చెప్పారని తెలిసింది. టీజర్ నే బాగా తీయలేని తేజ.. సినిమా ఎలా తీస్తారోనని బాలయ్య ఆందోళ పడుతున్నారు. అందుకే డైరక్టర్ ని మారిస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నట్లు టాక్. దర్శకుడిని మార్చితే ఈ సినిమా తొందరగా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. మరి ఏమి జరుగుతుందో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus