Balayya Babu: నందమూరి బాలయ్య లుక్ ను ఆ విధంగా ప్లాన్ చేశారా?

స్టార్ హీరో బాలకృష్ణ అతి త్వరలో అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మూవీ షూటింగ్ తో మళ్లీ బిజీ కానున్నారు. కాజల్, శ్రీలీల ఈ సినిమాలో నటిస్తుండగా శ్రీలీలకు తల్లి రోల్ లో కాజల్ కనిపిస్తారని తెలుస్తోంది. ఈ సినిమాలో కాజల్ రోల్ చనిపోతుందని కూడా వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తుండగా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. సినిమా సినిమాకు బాలయ్య మార్కెట్ సైతం పెరుగుతోంది. అయితే ఈ సినిమాలో బాలయ్య లుక్ చాలా స్పెషల్ గా ఉండనుందని సమాచారం.

అఖండ, వీరసింహారెడ్డి సినిమాలలోని బాలయ్య లుక్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పడ్డాయనే సంగతి తెలిసిందే. 60 ఏళ్ల వ్యక్తి పాత్రలో బాలయ్య గెటప్ అదిరిపోయేలా ఉండటంతో పాటు ప్రేక్షకులకు తెగ నచ్చుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. బాలయ్య రోల్ ను అనిల్ రావిపూడి పవర్ ఫుల్ గా డిజైన్ చేశారని తెలుస్తోంది. బాలయ్యకు మాస్ ఫ్యాన్స్ లో ఫాలోయింగ్ ఎక్కువ కాగా బాలయ్య అభిమానులను అంచనాలకు మించి మెప్పించేలా ఈ సినిమా ఉండనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

కామెడీ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు సైతం నచ్చే విధంగా ఈ సినిమా ఉంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. బాలయ్య ఈ మూవీ కోసం ఏకంగా 20 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. స్టార్ హీరో బాలకృష్ణ వరుస సినిమాలతో బిజీ అవుతున్నారు. బాలయ్య తర్వాత సినిమా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కనుంది.

బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన మూడు సినిమాలు విజయాలను సొంతం చేసుకోగా అఖండ సీక్వెల్ ఈ కాంబినేషన్ లో తెరకెక్కనుంది. అఖండ2 సినిమాకు సంబంధించి త్వరలో అప్ డేట్ రానుంది. బాలయ్య సినిమాలపై ప్రేక్షకుల్లో క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus