Balakrishna: రాజకీయాల గురించి రుద్రాంగి ప్రీ రిలీజ్ లో బాలకృష్ణ ఆసక్తికర కామెంట్స్!

జగపతిబాబు, మమతా మోహన్ దాస్, ఆశిష్ గాంధీ, విమల రామన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం రుద్రంగి. అజయ్ సామ్రాట్ దర్శకత్వంవచ్చిన ఈ సినిమా జూలై 7వ తేదీ విడుదల కానుంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ లో భాగంగా హైదరాబాద్లో ఘనంగా ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు అయితే ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన మాట్లాడుతూ తనకు రాజకీయాలు తెలియవు అంటూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి బాలకృష్ణ రాజకీయాలలో కూడా ఎంతో సక్సెస్ సాధించారు.ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం దివంగత నటుడు ఎన్టీఆర్ కుమారుడు అయినటువంటి బాలకృష్ణ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తరఫున హిందూపురం నియోజకవర్గంలో పోటీ చేసి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాలకృష్ణ నాకు రాజకీయాలు తెలియవంటూ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.మరి (Balakrishna) బాలకృష్ణ ఏ ఉద్దేశంతో ఇలాంటి కామెంట్స్ చేశారనే విషయానికి వస్తే…

ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ , డాక్టర్ రసమయినీ ఉద్దేశిస్తూ బాలకృష్ణ మాట్లాడారు.తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ గా రసమయిను నియమించినందుకు కేసీఆర్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఇక ఈయన తనకు సోదరుడితో సమానమని మా ఇద్దరికీ ఎలాంటి రాజకీయాలు తెలియవంటూ బాలయ్య ఈ సందర్భంగా కామెంట్ చేశారు. ఇక ఈ సినిమాకి డాక్టర్ రసమయి నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఇక ఈ సినిమా వేడుకలో భాగంగా తన తోటి నటుడు జగపతిబాబు గురించి కూడా మాట్లాడారు ఆయన ఏ సినిమాలోఅయినా ఒక పాత్రలో నటిస్తున్నారు అంటే ఆ పాత్రలో నటించారని ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి జీవిస్తారని తెలియజేశారు.ఇక బాలకృష్ణ జగపతిబాబు కాంబినేషన్లో లెజెండ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాలో జగపతిబాబు విలన్ పాత్ర ద్వారా అదరగొట్టారు. ఈ సినిమా జగపతిబాబు పాత్ర వల్లే ఎంతో మంచి సక్సెస్ సాధించింది అనడంలో ఇలాంటి సందేహం వ్యక్తం చేయాల్సిన పనిలేదు.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus