Balakrishna: అనిల్ రావిపూడి 30 ఏళ్ల క్రితం నాటి బాలయ్య లుక్ రిఫరెన్స్ తీసుకున్నాడా!

నటసింహ నందమూరి బాలకృష్ణ ‘అఖండ’, ‘వీర సింహా రెడ్డి’ లతో వరుసగా రెండు బ్లాక్ బస్టర్స్, కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్ కొట్టి ఫుల్ జోష్‌లో ఉన్న బాలయ్య ఇప్పుడు హ్యాట్రిక్ కోసం రెడీ అవుతున్నారు.. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో చేస్తున్న NBK 108 మీద అనౌన్స్ చేసినప్పటి నుంచే అంచనాలు పెరిగిపోయాయి.. ఇక ఉగాది సందర్భంగా నటసింహ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ రావడమే కాక ఎక్స్‌పెక్టేషన్స్ నెక్స్ట్ లెవల్ అనేంతలా మారిపోయింది పరిస్థితి..

టైటిల్ ఫిక్స్ చేయకుండా.. కేవలం కొత్త సంవత్సరాదికి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో అప్పటికప్పుడు ఫోటోషూట్ చేసి లుక్స్ వదిలారు.. బాలయ్య ఏజ్డ్ గెటప్, మీసకట్టు, గడ్డం, చేతికి కడియం, టాటు, చెవికి రింగ్.. తీక్షణమైన చూపుతో అదరగొట్టేశాడు.. కేవలం ఫోటోషూట్ పిక్సే ఇంత కిక్ ఇస్తే ఇక బాబుని సినిమాలో చూస్తే రచ్చ రంబోలానే అని తెగ హ్యాపీగా ఫీలవుతున్నారు ఫ్యాన్స్.. కథ తెలంగాణ నేపథ్యంలో సాగుతుందని చెప్పాడు దర్శకుడు..

ఇక బాలయ్య లుక్ చూస్తుంటే.. సరిగ్గా 30 ఏళ్ల క్రితం ‘నిప్పురవ్వ’ (1993) లో కనిపించినట్టే ఉందని.. ఆ మీసకట్టు అదీ అలాగే అనిపిస్తుందని.. పైగా బాలయ్య(Balakrishna) రాయల్టీ, కళ్లల్లో ఫైర్ అలాగే ఉన్నాయని.. ఆ లుక్ రిఫరెన్స్ తీసుకుని అనిల్ రావిపూడి.. బాలయ్య లుక్ సరికొత్తగా డిజైన్ చేసుంటాడని కామెంట్స్ చేస్తున్నారు.. షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద హరీష్ పెద్ది – సాహు గారపాటి నిర్మిస్తుండగా..

లేటెస్ట్ టాలీవుడ్ సెన్సేషన్, మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల బాలయ్య కూతురిగా.. కాజల్ అగర్వాల్ ఆయనకు తొలిసారి జోడీగా నటిస్తున్నారు.. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతమందిస్తున్నాడు.. కాజల్ ఇటీవలే షూటింగ్‌లో జాయిన్ అయింది.. దాదాపు 40 నిమిషాల పాటు ఉండే క్యారెక్టర్ కోసం ఆమె రూ. 3 కోట్లు తీసుకుంటుందని అంటున్నారు.. దసరాకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం..

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags