నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్లో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తరువాత ఓ మల్టీ స్టారర్ లో నటించబోతున్నాడని కొద్దిరోజుల నుండీ ప్రచారం జరుగుతుంది. యంగ్ హీరో నాగశౌర్యతో ‘శ్రీదేవి మూవీస్’ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ ఓ చిత్రాన్ని ప్లాన్ చేశారు.కథ ప్రకారం ఈ చిత్రంలో ఓ స్టార్ హీరో నటించాల్సి ఉందట. అందుకోసం బాలకృష్ణ అయితే కరెక్ట్ అని నిర్మాత భావించారట. నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ కు బాలకృష్ణ కు మంచి సాన్నిహిత్యం ఉంది.
గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ‘ఆదిత్య 369’ ‘వంశానికొక్కడు’ ‘భలేవాడివి బాసూ’ ‘మిత్రుడు’ వంటి చిత్రాలు వచ్చాయి. దాంతో నిర్మాత బాలయ్యను సంప్రదించగా ఆయన ఓ కండిషన్ పెట్టారట. బాలయ్య పాత్రకు ప్రాముఖ్యత ఉన్నప్పటికీ.. ఎక్కువ స్క్రీన్ టైం నాగ శౌర్యకు మాత్రమే ఉంది కాబట్టి, ఈ చిత్రంలో నటిస్తున్నందుకు ఆయన అభిమానులు ఫీలవుతారని బాలయ్య తెలిపాడట. ఈ చిత్రంలో నటించాలి అంటే నేనడిగినంత పారితోషికం ఇవ్వాలని కండిషన్స్ పెట్టాడట. బాలయ్య చెప్పిన రేటు నిర్మాతకు నచ్చకపోవడంతో లైట్ తీసుకున్నాడని సమాచారం.
ప్రస్తుతం నిర్మాత చూపు వెంకటేష్ పై ఉన్నట్టు భోగట్టా. మరి ఆయనేమంటాడో.. తెలియాల్సి ఉంది. ఇక నాగ శౌర్య ఈ చిత్రంతో పాటు మరో రెండు చిత్రాలకు కూడా ఓకే చెప్పిన సంగతి తెలిసిందే.
Most Recommended Video
మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా రివ్యూ & రేటింగ్!
అనగనగా ఓ అతిధి సినిమా రివ్యూ & రేటింగ్!
రెండు చేతులా సంపాదిస్తున్న 13 హీరోయిన్లు..వీళ్లది మామూలు తెలివి కాదు..!