బాలకృష్ణకు నోటీసులు పంపిన హైకోర్టు
- March 28, 2017 / 02:52 PM ISTByFilmy Focus
ప్రముఖ సినీ నటుడు, ఎమ్మెల్యే నమదమూరి బాలకృష్ణకు హైకోర్టు నోటీసులను పంపించింది. తన 101 వ సినిమా పనుల్లో బిజీగా ఉన్న బాలయ్యకు ఈ నోటీసులు షాక్ కి గురిచేసింది. ఎందుకు నోటీసులను పంపిందని ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. తెలుగు ఖ్యాతిని దేశమంతా విస్తరించిన శాతవాహన చక్రవర్తి శాతకర్ణి జీవిత గాధ ఆధారంగా బాలకృష్ణ గౌతమి పుత్ర శాతకర్ణి చేశారు. క్రిష్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మూవీకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు ప్రభుత్వాలు వినోదపు పన్ను మినహాయింపు కలిగించాయి.
అయితే ఈ విషయంలో ఇరు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు సరైన పారదర్శకత పాటించలేదని ఓ అజ్ఞాతవ్యక్తి వేసిన పిటిషన్ ను స్వీకరించిన కోర్టు ఆ చిత్ర నిర్మాతలు, హీరోకి నోటీసులు జారీ చేసింది. ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ పన్ను రాయితీ విషయమై ఇంకో రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని కోర్టు తెలిపింది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.












