Balakrishna Remuneration: రికార్డు స్థాయిలో బాలయ్య పారితోషికం.. కానీ?

స్టార్ హీరో బాలకృష్ణ వరుసగా సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఒక సినిమాకు, అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మరో సినిమాకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బాలయ్య హీరోగా సంపత్ నంది డైరెక్షన్ లో ఒక సినిమా తెరకెక్కనుందని వార్తలు వస్తున్నా ఈ వార్తలకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అఖండ సినిమా వరకు బాలయ్య ఒక్కో సినిమాకు 10 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారు.

అయితే అఖండ సక్సెస్ తో బాలయ్య రెమ్యునరేషన్ ను పెంచేశారని బోగట్టా. బాలయ్య ప్రస్తుతం ఒక్కో సినిమాకు 13 కోట్ల రూపాయల నుంచి 15 కోట్ల రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. బాలయ్య సినిమాలకు బిజినెస్ బాగానే జరుగుతుండటంతో నిర్మాతలు సైతం బాలయ్య అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి వెనుకడుగు వేయడం లేదు. బాలయ్య తర్వాత నాలుగు సినిమాలతో ఏకంగా 50 కోట్ల రూపాయలకు పైగా పారితోషికం తీసుకుంటున్నారని సమాచారం.

అయితే బాలయ్య వరుసగా సక్సెస్ లు సాధిస్తే మాత్రమే రెమ్యునరేషన్ మరింత పెరుగుతుందని అభిమానులు భావిస్తున్నారు. సింహా, లెజెండ్ సక్సెస్ తర్వాత వరుస విజయాలను అందుకోవడంలో బాలయ్య ఫెయిల్ అయిన సంగతి తెలిసిందే. అయితే అఖండ తర్వాత మాత్రం బాలయ్య వరుస విజయాలను అందుకుంటారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. మాస్ సినిమాలను తెరకెక్కించే సత్తా ఉన్న డైరెక్టర్లకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. మరోవైపు బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు వస్తే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు.

బాలకృష్ణను అద్భుతంగా చూపించే డైరెక్టర్లలో బోయపాటి శ్రీను ఒకరని బాలయ్య ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. అఖండ సినిమాకు సీక్వెల్ ఉండవచ్చని వార్తలు ప్రచారంలోకి రాగా ఆ వార్తలు నిజమవుతాయో లేదో చూడాల్సి ఉంది. బాలయ్య ఈ ఏడాది కనీసం ఒక్క సినిమాను అయినా విడుదల చేయాలని అనుకుంటున్నారు. వచ్చే నెల నుంచి బాలయ్య గోపీచంద్ మలినేని మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus