Balakrishna: బాలకృష్ణ కూతురికి బడా డైరెక్టర్ ఆఫర్.. ఏం జరిగిందంటే..!

నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) టాక్ షో ‘అన్‌స్టాపబుల్’ నాలుగో సీజన్ లో సందడి చేస్తూ, తన ప్రత్యేక వ్యాఖ్యానంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నారు. ఈ షోలో పలువురు ప్రముఖులు పాల్గొంటుండగా, తాజా ఎపిసోడ్‌లో దర్శకుడు బాబీ (Bobby) , సంగీత దర్శకుడు తమన్, నిర్మాత నాగవంశీ (Suryadevara Naga Vamsi) గెస్ట్‌లుగా వచ్చి ఆహ్లాదకరమైన చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమన్ అడిగిన ప్రశ్నకు బాలకృష్ణ తన పెద్ద కూతురు బ్రాహ్మణి గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. మణిరత్నం (Mani Ratnam) దర్శకత్వంలో ఒక సినిమాలో బ్రాహ్మణిని హీరోయిన్‌గా తీసుకోవాలని అనుకున్నట్లు చెప్పారు.

Balakrishna

ఆ ఇది తనకెంతో ఆనందం కలిగించిందని, ఆ ఆఫర్ గురించి బ్రాహ్మణిని అడగగా “మై ఫేస్” అంటూ సరదాగా సమాధానం చెప్పిందని బాలకృష్ణ గుర్తు చేసుకున్నారు. అయితే, బ్రాహ్మణి ఆ సమయంలో సినిమాల్లో నటించడంపై ఆసక్తి చూపకపోవడంతో ఆ ఆఫర్ కాస్త చేజారింది. ఆ మాటకు నవ్వుతూ, బ్రాహ్మణి పెద్దగా పట్టించుకోలేదని బాలయ్య వివరణ ఇచ్చారు. ఇక తన ఫోకస్ పూర్తిగా చదువుపైనే ఉందని, ఆ దిశలో తన కెరీర్‌ను అద్బుతంగా నిర్మించుకుందని చెప్పారు.

రెండో కూతురు తేజస్విని గురించి మాట్లాడుతూ, చిన్నప్పటి నుంచే ఆమె నటనపై ఆసక్తి చూపేదని, కచ్చితంగా నటి అవుతుందని తాను భావించానని వెల్లడించారు. అయితే, తేజస్విని ప్రస్తుతానికి ‘అన్‌స్టాపబుల్’ షోలో క్రియేటివ్ కన్సల్టెంట్‌గా ఉన్నారట. ఈ క్రమంలో తన కుమార్తెలు వారికి నచ్చిన రంగంలో అద్భుతంగా రాణించడంపై తాను గర్వపడుతున్నానని బాలకృష్ణ తెలిపారు.

“వాళ్లంతా తమదైన ప్రదేశాన్ని సంపాదించుకున్నప్పుడు, తండ్రిగా నాకందుకు మించిన ఆనందం మరొకటి లేదు” అని అన్నారు. ఈ విషయాలు అభిమానులను మరింత ఆసక్తికరంగా ఆకర్షించాయి. బాలకృష్ణ తన వ్యక్తిగత విషయాలను ఈ విధంగా పంచుకోవడం, వారి కుటుంబ సభ్యుల పట్ల ఉన్న గౌరవాన్ని చూపించడం ఫ్యాన్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

కమ్ముల కూడా ఆలస్యం చేస్తున్నాడే.. కుబేర న్యూ డేట్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus