Balakrishna: ఫ్యాన్స్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన బాలయ్య!

స్టార్ హీరో బాలకృష్ణ అఖండ సక్సెస్ తో జోరుమీదున్నారు. పలు ఏరియాల్లో అఖండ ఇప్పటికే బ్రేక్ ఈవెన్ కావడంతో పాటు డిస్ట్రిబ్యూటర్లకు భారీగా లాభాలను అందిస్తుండగా మిగిలిన ఏరియాల్లో ఈ వీకెండ్ నాటికి బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంది. వైజాగ్ లో అఖండ మూవీ గ్రాండ్ సక్సెస్ ఈవెంట్ జరగగా ఈవెంట్ లో బాలయ్య తనకు లక్షల మంది అభిమానులు ఉండటాన్ని పూర్వజన్మ సుకృతంగా భావిస్తానని తెలిపారు. నా విజయాలలో అభిమానులు పాలు పంచుకున్నారని అపజయాలు వచ్చిన సమయంలో ఫ్యాన్స్ వెన్నంటి ఉన్నారని బాలయ్య తెలిపారు.

కొత్తగా ఏం చేయాలనుకున్నా అభిమానులు ధైర్యాన్ని ఇస్తున్నారని బాలయ్య పేర్కొన్నారు. కరోనా పరిస్థితులలో ఇంతటి అఖండ విజయాన్ని అందించడం గొప్ప విషయమని బాలకృష్ణ కామెంట్లు చేశారు. అభిమానులు ఇండస్ట్రీకి ధైర్యాన్ని ఇవ్వడంతో పాటు మంచి సినిమాలను ఆదరిస్తారని ప్రూవ్ చేశారని బాలయ్య చెప్పుకొచ్చారు. అభిమానులను ఎలా రెచ్చగొట్టాలో, థియేటర్లలో ఏ విధంగా రచ్చ చేయాలో దబిడిదిబిడి ఎలా చేయాలో తనకు తెలుసని బాలయ్య వెల్లడించారు. దర్శకుడు బోయపాటి శ్రీనుకు టెక్నీషియన్ల నుంచి సమర్థవంతంగా అవుట్ పుట్ తీసుకోగల టాలెంట్ ఉందని బాలకృష్ణ కామెంట్లు చేశారు.

ధైర్యంగా సినిమాను విడుదల చేసిన నిర్మాతలకు నా కృతజ్ఞతలు అని బాలకృష్ణ వెల్లడించారు. ప్రగ్యా జైస్వాల్ పాత్రను హుందాగా చేశారని ఆమెకు టాలెంట్ తో పాటు అందం కూడా ఉందని బాలకృష్ణ అన్నారు. పూర్ణ, దేష్ణ సినిమాలోని పాత్రలను అద్భుతంగా పోషించారని బాలయ్య పేర్కొన్నారు.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus