Balakrishna: ఆ ప్రశ్న గురించి బాలయ్య షాకింగ్ రియాక్షన్.. అసలేం జరిగిందంటే?

స్టార్ హీరో నందమూరి బాలకృష్ణకు (Balakrishna)  ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ మామూలు క్రేజ్ కాదనే సంగతి తెలిసిందే. బాలయ్యకు వరుస విజయాలు కెరీర్ పరంగా హెల్ప్ అయ్యాయని చెప్పడంలో సందేహాలు అవసరం లేదు. గతంలో యాడ్స్ కు, షోలకు దూరంగా ఉన్న బాలయ్య ఇప్పుడు వాటితో కూడా బిజీ అవుతూ ప్రేక్షకులను ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బాలయ్య చేసిన పని నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.

Balakrishna

ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు బాలయ్య (Balakrishna) తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఒక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న బాలయ్యతో ఒక రిపోర్టర్ మాట్లాడుతూ మేడంకు ఎప్పుడైనా చీర కొన్నారా? అని ప్రశ్నించగా ఇప్పుడు ఎందుకు అవన్నీ.. అనవసరంగా పుల్లలు పెట్టొద్దు అంటూ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. బాలయ్య అలా కామెంట్లు చేయడం అందరూ పకపకా నవ్వారు.

బాలయ్య ప్రస్తుతం బాబీ  (Bobby) సినిమాతో బిజీగా ఉండగా దసరా కానుకగా ఈ సినిమాకు సంబంధించి ఏదైనా అప్ డేట్ వస్తుందో చూడాల్సి ఉంది. బాబీ బాలయ్యను పవర్ ఫుల్ గా చూపించనున్నారని ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్ లో యాక్షన్ సన్నివేశాలు ఉండనున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య కథల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

బాలయ్య సినిమా సినిమాకు లుక్ విషయంలో వేరియేషన్ చూపిస్తున్నారు. బాలయ్య కొత్త ప్రాజెక్ట్ లో సూపర్ హీరోగా కనిపించనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. బాలయ్య తర్వాత సినిమాలను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తుండటంతో ఇతర భాషల్లో ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. బాలయ్య 62 సంవత్సరాల వయస్సులో సైతం సినిమాల కోసం కష్టపడుతున్నారు. బాలయ్యను ప్రేక్షకులు ఏ విధంగా చూడాలని కోరుకుంటున్నారో దర్శకులు సైతం అదే విధంగా చూపిస్తున్నారు.

కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్ తో విశ్వంభర టీజర్.. ఆ షాట్ సూపర్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus