నందమూరి బాలకృష్ణ, అతిలోక సుందరి శ్రీదేవి కాంబినేషన్‌లో సినిమా ఎందుకు రాలేదు? అనే సందేహం అప్పటి వారికే కాదు.. ఈ తరం ప్రేక్షకాభిమానులకు కూడా వస్తుంది.. ఎందుకంటే.. ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత చిరంజీవి.. నాగేశ్వర రావు కొడుకు నాగార్జునతో పాటు వెంకటేష్‌తోనూ ఆమె నటించింది. కానీ ఒక్క బాలయ్య బాబుతో మాత్రమే జత కట్టలేదు.. పైగా ఎన్టీఆర్ ‘బడిపంతులు’ చిత్రంతో బాలనటిగా పరిచయం అయిన శ్రీదేవి.. 1970 కాలంలో.. కేవలం 16 ఏళ్ల వయసులోనే ఎంట్రీ ఇచ్చి..
ఆయనతో కథానాయికగా సూపర్ డూపర్ ఫిలింస్ చేసి.. బంపర్ జోడీ అనిపించుకుంది.. అటువంటి శ్రీదేవితో బాలయ్య నటించకపోవడానికిగల ఆసక్తికరమైన అంశాలేంటో ఇప్పుడు చూద్దాం.. 1987లో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు, బాలయ్య – శ్రీదేవిల క్రేజీ కాంబోలో ‘సామ్రాట్’ సినిమా చేద్దామనుకున్నారు. తండ్రి ఎన్టీఆర్ గారికి ఈ కాంబినేషన్ ఎందుకో అస్సలు నచ్చలేదు. అలా మొదటిసారి వీరిద్దరు జంటగా రావాల్సిన సినిమా మిస్ అయ్యింది. విజయ శాంతిని కథానాయికగా తీసుకున్నారు. ఆ తర్వాత 1989లో స్టార్ డైరెక్టర్ ఎ. కోదండ రామిరెడ్డి, బాలయ్యతో తీస్తున్న ‘భలేదొంగ’మూవీలో శ్రీదేవిని ఆయనకు జోడీగా అనుకున్నారు.
కోదండరామి రెడ్డి అంటే శ్రీదేవికి కూడా గౌరవమే. అడిగితే ఆయన మాట కాదనదు.. అలానే బాలయ్య బాబు పక్కన నటించడానికి కూడా అంగీకరించే సమయంలో.. కొంతమంది నందమూరి అభిమానులు ఈ ప్రయత్నానికి అడ్డు తగిలారు. శ్రీదేవి, తండ్రి ఎన్టీఆర్‌తో పాటు కొడుకు బాలయ్య పక్కన కూడా నటిస్తే బాగోదని ఏకంగా ఎన్టీఆర్‌కే వెళ్లి చెప్పడంతో.. ఆయన మళ్లీ ఈ కాంబోకి నో అన్నారు. ఆ విధంగా ‘భలేదొంగ’ లో శ్రీదేవి స్థానంలో విజయ శాంతిని తీసుకున్నారు.
శ్రీదేవి మిస్ అయిన రెండు సినిమాల్లోనూ విజయ శాంతినే తీసుకోవడం.. బాలయ్యతో ఆమెది బ్లాక్ బస్టర్ జోడీ కావడం విశేషం.. ఆ తర్వాత ఎప్పుడూ బాలయ్య – శ్రీదేవి కాంబినేషన్ సెట్ చేసేందుకు దర్శక నిర్మాతలెవరూ ప్రయత్నం చేయలేదు. ఇంకో వెర్షన్ ఏంటంటే.. ‘తండ్రి పక్కన నటించిన శ్రీదేవి అంటే నాకు తల్లితో సమానం.. నేను ఆమెతో నటించను’ అని బాలయ్యే ఒప్పుకోలేదని కూడా అంటుంటారు.. కానీ, ఎన్టీఆర్ పక్కన చేసిన జయప్రదతో ‘మహారథి’, జయసుధతో ‘పరమవీర చక్ర’, ‘అధినాయకుడు’ చిత్రాల్లో నటించాడు బాలయ్య..
లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..