మోక్షజ్ఞ కోసం కథ రాయమని స్టార్‌ హీరోను కోరిన బాలకృష్ణ.. తాను కూడా..!

దర్శకుడు అవ్వాలని నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) చాలా ఏళ్ల నుండి అనుకుంటున్నారు. ఈ మేరకు గతంలో ‘నర్తనశాల’ సినిమాతో ఓ మారు ప్రయత్నించినా వర్కౌట్‌ కాలేదు. ఆ సినిమా మొదలుపెట్టిన దగ్గర నుండి ఏదో సమస్య వస్తూనే ఉంది. ఆఖరికి ఆ సినిమాను ఆర్ధాంతరంగా ఆపేసి.. తీసినంతవరకు రిలీజ్‌ చేసేశారు. అయితే ఇంకా ఆయనలో కథకుడు, దర్శకుడు అప్పుడప్పుడు బయటకు రావాలని చూస్తుంటారు. ఆ ఆలోచనతో అన్నారో, లేక మాట వరసకు అన్నారో కానీ యువ కథానాయకుడు దుల్కర్‌ సల్మాన్‌కు  (Dulquer Salmaan) కథ రాస్తా అని అన్నారు.

Balakrishna

బాలయ్య హోస్ట్‌గా చేస్తున్న ‘అన్‌స్టాపబుల్‌’ టాక్‌ షోకి ఇటీవల దుల్కర్ సల్మాన్‌ విచ్చేసిన విషయం తెలిసిందే. తన కొత్త సినిమా ‘లక్కీ భాస్కర్‌’ (Lucky Baskhar) సినిమా ప్రచారంలో భాగంగా వచ్చిన దుల్కర్‌తో బాలయ్య సరదా ప్రశ్నలు వేస్తూ, ఆటలు ఆడిస్తూ సందడి చేశాడు. ఈ క్రమంలో మమ్ముట్టి (Mammootty) ప్రస్తావన వచ్చింది. ఆయనతో వీడియో కాల్‌లో మాట్లాడాడు బాలయ్య. ‘‘బాలకృష్ణా.. మీ షో చూస్తుంటాను. మీ లాంటి హీరో టాక్‌ షో ఎలా చేస్తున్నారా? అని ఆశ్చర్యపోతున్నాను.

మీతో తప్పకుండా యాక్ట్‌ చేస్తా’’ అని మమ్ముట్టి వీడియో కాల్‌లో చెప్పారు. ఆ తర్వాత దుల్కర్‌తో ఇప్పటివరకు మీ నాన్నతో స్క్రీన్‌ షేర్‌ చేసుకోకపోవడానికి కారణం ఏమిటి? అని అడిగారు. నాతో యాక్ట్‌ చేయడానికి నాన్న ఇప్పటివరకూ అంగీకరించలేదు. కానీ, ఆయనతో ఒక్కసారైనా స్క్రీన్‌ షేర్‌ చేసుకోవాలని ఉంది. ఆ క్షణం కోసం ఎదురుచూస్తున్నా అని తన మనసులో మాట చెప్పేశాడు.

దానికి బాలయ్య అలా అయితే ఆ సినిమాకు స్క్రిప్ట్‌ నేను రాస్తాను అని నవ్వేశాడు. దానికి దుల్కర్‌ ఓకే సర్‌ అంటూ నవ్వేశాడు. అయితే దానికి బాలయ్య ఓ లింక్‌ పెట్టాడు. అలా అయితే నాకు, మా అబ్బాయికి నువ్వు స్క్రిప్ట్‌ సిద్ధం చెయ్‌, మీకు నేను స్క్రిప్ట్‌ రాస్తాను అని డీల్‌ చేసుకున్నాడు. చూద్దాం బాలయ్య ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకొని కథ రాస్తారేమో.

సిద్ధార్థ్‌ న్యూడ్‌ సీన్‌కి ఎంత ఖర్చయిందో తెలుసా? ఎన్ని రోజులు తీశారంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus