ఎన్నో క్రేజీ కాంబినేషన్స్ కొన్ని అనుకోని కారణాల వల్ల కుదరకపోవడం అనేది ఏ ఇండస్ట్రీ లో అయినా సర్వసాధారణం. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ విషయాలను తెలుసుకొని అయ్యో ఎలాంటి సినిమాని మిస్ అయ్యాం, చేసి ఉంటే వేరే లెవెల్ లో ఉండేది కదా అని అనుకుంటూ ఉంటాము. అలాంటి కాంబినేషన్ ఒకటి మిస్ అయ్యింది. టాలీవుడ్ నుండి మంచి మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న బాలయ్య బాబు, తమిళ స్టార్ హీరో విజయ్ కలిసి ఒక సినిమా చెయ్యాలని అనుకున్నాడట ఒక కుర్ర డైరెక్టర్.
కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకి వెళ్ళలేదు. ఆ సినిమా పేరే ‘జిల్లా’. విజయ్ హీరో గా నూతన దర్శకుడు నేషన్ దర్శకత్వం లో చేసిన ఈ సినిమా 2014 సంక్రాంతి కానుకగా విడుదలై మంచి హిట్ గా నిల్చింది. ఈ సినిమాలో మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒక ముఖ్యమైన పాత్ర పోషించాడు. ఈ పాత్ర చిత్రానికే ప్రధాన హైలైట్స్ లో ఒకటిగా నిల్చింది.
అయితే ఈ క్యారక్టర్ ని తొలుత నందమూరి బాలకృష్ణ (Balakrishna) తో చేయిద్దామని అనుకున్నాడట డైరెక్టర్ నేషన్. కానీ బాలయ్య ఇప్పట్లో నాకు తమిళ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టే ఉద్దేశ్యం లేదని, ఈ సినిమాలో నేను నటించను అని ముఖం మీదనే సూటిగా చెప్పి పంపాడట. ఆ తర్వాత ఈ పాత్ర కోసం మోహన్ లాల్ ని సంప్రదించగా ఆయన వెంటనే ఓకే చెప్పి నటించాడు.
అలా మొదలైన ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఒకవేళ బాలయ్య ఈ సినిమాలో మోహన్ లాల్ పాత్ర చేసి ఉంటే , ఆ చిత్రానికి రేంజ్ మరింత పెరిగేదని, విజయ్ కి తెలుగు లో మార్కెట్ అప్పట్లోనే వచ్చి ఉండేదని అంటున్నారు ట్రేడ్ పండితులు.