Balakrishna: బాలకృష్ణతో సూపర్ హిట్ సినిమా రీమేక్.. క్లారిటీ ఇదే.!

నందమూరి బాలకృష్ణ (Balakrishna)  కెరీర్లో ఒక్క ‘లక్ష్మీ నరసింహ’ (Lakshmi Narasimha) తప్ప రీమేక్ సినిమాలు అంటూ ఎక్కువగా లేవు. ‘అనుకరించడం, అనుసరించడం ఇష్టం ఉండదు అంటూ బాలయ్య’ పలు మార్లు చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. కానీ గత రెండు రోజులుగా బాలయ్య ఓ సూపర్ హిట్ సినిమా రీమేక్లో నటిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. వివరాల్లోకి వెళితే.. మలయాళంలో ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil) హీరోగా ‘ఆవేశం’ అనే సూపర్ హిట్ సినిమా రూపొందింది. గ్యాంగ్స్టర్ కథాంశంతో రూపొందిన ఈ సినిమా అక్కడ భారీ వసూళ్లు సాధించింది.

కేవలం రూ.30 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ అక్కడ రూ.155 కోట్ల వరకు భారీ కలెక్షన్లు సాధించింది. తెలుగులో కూడా ఈ సినిమాని చాలా మంది ప్రేక్షకులు చూడటం జరిగింది. ఇదిలా ఉండగా.. ‘ఆవేశం’ ని తెలుగులో నందమూరి బాలకృష్ణ రీమేక్ చేస్తున్నట్టు రెండు రోజుల నుండి టాక్ నడుస్తుంది. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు కూడా ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదు అని సమాచారం.

బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్ కి సెట్ అయ్యే కథ ఇది అని అంతా అంటున్నారు. కానీ ఒరిజినల్లో ఫహాద్ ఫాజిల్ నటన, మ్యూజిక్ మాత్రమే హైలెట్ అయ్యాయి. కథ పరంగా కొత్తగా ఏమీ ఉండదు. అందుకే బాలయ్య.. ‘ఆవేశం’ కథపై ఇంట్రెస్ట్ చూపించడం లేదు అని స్పష్టమవుతుంది. అయితే ‘మైత్రి..’ సంస్థలో కచ్చితంగా మరో సినిమా చేయడానికి బాలయ్య ఆసక్తి చూపుతున్నారట.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus