Balakrishna: ఎమ్మెల్యే పాత్రలో కనిపించబోతున్న బాలయ్య.. ట్విస్ట్ ఇదే!

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలయ్య (Balakrishna) బాబీ (Bobby) డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలో డ్యూయల్ రోల్ లో కనిపిస్తారని ఇప్పటికే వార్తలు వినిపించాయి. అయితే బాలయ్య ఒక పాత్రలో ఎమ్మెల్యేగా కనిపిస్తారని తెలుస్తోంది. రియల్ లైఫ్ లో ఎమ్మెల్యే అయిన బాలయ్య రీల్ లైఫ్ లో కూడా ఎమ్మెల్యే రోల్ పోషిస్తే మూవీ మామూలుగా ఉండదని బాలయ్య ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. బాలయ్య ఎమ్మెల్యే రోల్ పోషించినా ఏ పొలిటికల్ పార్టీకి అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ డైలాగ్స్ ఈ సినిమాలో ఉండవని సమాచారం అందుతోంది.

బాలయ్య ఏ పాత్ర పోషించినా న్యాయం చేస్తారని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఈ సినిమాకు వీరమాస్ అనే పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ అయిందని వార్తలు వినిపిస్తున్నా అధికారికంగా క్లారిటీ వస్తే మాత్రమే ఈ వార్తలను నమ్మాల్సి ఉంటుందని చెప్పవచ్చు. బాలయ్య ప్రస్తుతం హిందూపురంలో రాజకీయ కార్యక్రమాలతో బిజీ అయ్యారు. ఎన్నికల్లో మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్ సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

బాలయ్య జాతకం బాగుందని ఈ ఏడాది సినిమాల్లో, రాజకీయాల్లో బాలయ్యకు అనుకూల ఫలితాలు వస్తాయని జ్యోతిష్కులు వెల్లడించారు. త్వరలో బాలయ్య కొత్త సినిమాలకు సంబంధించిన ప్రకటనలు రానున్నాయి. బాలయ్య బాబీ కాంబో మూవీ ఈ ఏడాదే విడుదలవుతుందో లేక 2024 సంక్రాంతి కానుకగా విడుదలవుతుందో తెలియాల్సి ఉంది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైతే మాత్రం ఇతర సినిమాల నుంచి గట్టి పోటీ ఎదురవుతుంది.

ఈ సినిమా విషయంలో బాలయ్య ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయో చూడాలి. ఫ్యాన్స్ మాత్రం బాలయ్య తర్వాత సినిమాలతో సులువుగా 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధిస్తారని భావిస్తున్నారు. వరుసగా మాస్ సినిమాలలో నటిస్తున్న బాలయ్యకు ఇతర భాషల ప్రేక్షకుల్లో సైతం మంచి గుర్తింపు ఉంది. అఖండ2 (Akhanda) సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus