Balakrishna,Jr NTR: నందమూరి హీరోల అదృష్టం మామూలుగా లేదుగా! ఇక ప్యాన్స్ కు పండగే!

నందమూరి ఫ్యామిలీ కి ప్రస్తుతం గోల్డెన్ పీరియడ్ నడుస్తుంది. ఒక పక్క నందమూరి బాలకృష్ణ వరుస సూపర్ హిట్ సినిమాలతో ముందుకు దూసుకుపోతూ మంచి ఊపు మీదుంటే, మరో పక్క జూనియర్ ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ చిత్రం తో గ్లోబల్ వైడ్ క్రేజ్ ని దక్కించుకొని గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. 2000 వ సంవత్సరం నుండి 2004 వ సంవత్సరం వరకు నందమూరి ఫ్యామిలీ ఒక రేంజ్ సూపర్ హిట్స్ ఫామ్ లో ఉండేది.

మళ్ళీ ఇన్నాళ్లకు ఆ రేంజ్ ఫామ్ లో ఉన్నది ఇప్పుడే.ఇదే ఊపుని కొనసాగిస్తూ వీళ్లిద్దరు తమ భవిష్యత్తులో చెయ్యబొయ్యే ప్రాజెక్ట్స్ గురించి కూడా ఎంతో శ్రద్ద తీసుకుంటున్నారు. బాలయ్య బాబు కి డ్రీం ప్రాజెక్ట్ ‘చెంగిస్ ఖాన్’ బయోపిక్ చెయ్యడమే, ఈ సినిమాని నిర్మించాలంటే దాదాపుగా 1000 కోట్ల రూపాయిల ఖర్చు అవుతుంది. బి గోపాల్ దర్శకత్వం లో తెరకెక్కబోతున్న ఈ సినిమా కి సంబంధించిన పూర్తి వివరాలు అతి త్వరలోనే తెలియచేయనున్నారు.

ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ (JrNTR) కూడా వరుసగా సినిమాలు చేస్తూ బిజీ గా ఉన్నాడు. ప్రస్తుతం కొరటాల శివ తో ‘దేవర’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ని కూడా కొద్దిరోజుల క్రితమే విడుదల చేసారు. ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది, ఈ సినిమా తర్వాత ఆయన ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా, అలాగే హ్రితిక్ రోషన్ తో కలిసి ‘వార్ 2 ‘ చిత్రాల్లో నటించబోతున్నాడు.

ఈ రెండు సినిమాలు కాకుండా రాజమౌళి తో ఎన్టీఆర్ 5000 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ సినిమా కూడా లైన్ లో ఉందట. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు తో కలిసి ఒక సినిమా చెయ్యబోతున్న రాజమౌళి, ఈ చిత్రం పూర్తి అయినా వెంటనే ఈ ప్రాజెక్ట్ కి షిఫ్ట్ అయ్యిపోతాడని తెలుస్తుంది.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus