Balakrishna: ఆ డైరెక్టర్ కు వార్నింగ్ ఇచ్చిన బాలకృష్ణ!

  • December 22, 2021 / 03:39 PM IST

స్టార్ హీరో బాలకృష్ణ నటించిన అఖండ మూవీ థియేటర్లలో ఏకంగా 67 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సాధించింది. సింహా, లెజెండ్ సినిమాలను మించి అఖండ సినిమా ఘన విజయాన్ని సాధించడంతో బాలయ్య అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. బాలయ్య తరువాత సినిమాకు గోపీచంద్ మలినేని డైరెక్టర్ కాగా ఈ సినిమాకు వేటపాలెం అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షోకు రవితేజతో పాటు గోపీచంద్ మలినేని కూడా హాజరయ్యారు. ఈ ఎపిసోడ్ డిసెంబర్ నెల 31వ తేదీన స్ట్రీమింగ్ కానుందని సమాచారం. గోపీచంద్ మలినేని ఎంట్రీ ఇవ్వగానే నెక్స్ట్ బ్లాక్ బస్టర్ ఇవ్వాలని లేకపోతే చంపేస్తానంటూ బాలయ్య గోపీచంద్ మలినేనికి కత్తులతో పొడుస్తున్నట్టు ఎక్స్ ప్రెషన్ ఇచ్చి సరదాగా వార్నింగ్ ఇచ్చారు. షోలో గోపీచంద్ మలినేని సమరసింహారెడ్డి సినిమా కోసం అరెస్ట్ అయ్యానని చెప్పుకొచ్చారు.

ఈ షోలో జై బాలయ్య సాంగ్ కు బాలయ్య, రవితేజ కలిసి డ్యాన్స్ చేయడం గమనార్హం. అఖండ సక్సెస్ తో జోరుమీదున్న బాలకృష్ణ భవిష్యత్తు సినిమాలు సైతం బ్లాక్ బస్టర్ హిట్లు అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గోపీచంద్ మలినేని బాలకృష్ణ కోసం పవర్ ఫుల్ కథను సిద్ధం చేశారని తెలుస్తోంది. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. బాలయ్యకు జోడీగా శృతిహాసన్ ఈ సినిమాలో ఎంపికయ్యారు. బాలయ్య శృతి కాంబోలో తెరకెక్కుతున్న తొలి సినిమా ఇదే కావడం గమనార్హం.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. అనిల్ రావిపూడితో కూడా బాలయ్య హీరోగా ఒక సినిమా ఫిక్స్ అయింది. వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బాలయ్య కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు. అఖండ సినిమాతో యూత్ లో బాలయ్యకు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus