Balakrishna: ఆ సినిమాలో బాలయ్య లుక్ కి ఫిదా అయిన వసుంధర!

నందమూరి తారక రామారావు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు బాలకృష్ణ.ఈయన ఎన్నో సినిమాలలో బాల నటుడిగా అనంతరం హీరోగా వెండితెరపై తన నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. ఈ విధంగా వెండితెరపై అగ్ర హీరోగా ఓ వెలుగు వెలిగిన బాలకృష్ణ ప్రస్తుతం రాజకీయాలలో కూడా ఎంతో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఈయన రెండు సార్లు ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టారు. ఇక సినిమాల విషయానికి వస్తే బాలకృష్ణ సుమారు వంద సినిమాలకు పైగా నటించిన విషయం మనకు తెలిసిందే.

ఇలా ఈయన అగ్ర హీరోగా రాజకీయ నాయకుడిగా పేరు సంపాదించుకున్నప్పటికీ ఈయన పేరు పలుకుబడిని తమ కుటుంబ సభ్యులు ఎక్కడ దుర్వినియోగంగా ఉపయోగించలేదని చెప్పాలి. బాలకృష్ణ పూర్తిగా తన వ్యక్తిగత జీవితాన్ని వృత్తిపరమైన జీవితానికి ముడి పెట్టరు. బాలకృష్ణ మాదిరిగానే ఆయన కుటుంబ సభ్యులు సైతం ఎక్కడ తన విషయాలలో జోక్యం చేసుకోరు.ఇకపోతే బాలకృష్ణ వసుంధర అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఈమె కూడా కేవలం కుటుంబ కార్యక్రమాలలో మినహా ఎక్కడ బయట కనిపించరు.

అయితే బాలకృష్ణ సినిమాలు అంటే తనకు ఎంతో ఇష్టమని బాలకృష్ణ సినిమాలు చూస్తూ ఉంటానని ఈమె బాలకృష్ణ సినిమాల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టినట్టు డైరెక్టర్ వివి వినాయక్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. బాలకృష్ణ సినిమాలలో వసుంధర గారికి నచ్చిన సినిమా గురించి ఈయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇప్పటివరకు ఎన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు చేసిన ఆయన చెన్నకేశవరెడ్డి సినిమా అంటే తనకు ఎంతో ఇష్టమని వసుంధర గారు ఒకరోజు తనతోనే చెప్పినట్లు వివి వినాయక్ ఈ సందర్భంగా వెల్లడించారు.

ఈ సినిమా షూటింగ్ సమయంలో షూటింగ్లో జరిగిన ప్రతి విషయాన్ని బాలకృష్ణ తనతో చెప్పేవారని వసుంధర వెల్లడించినట్లు ఈయన తెలిపారు. ఇకపోతే ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో నటించిన విషయం మనకు తెలిసిందే. ఇందులో తండ్రి పాత్రలో బాలకృష్ణ లుక్ తనకి ఎంతగానో నచ్చింది. తనని తండ్రి పాత్రలో ఎంతో అద్భుతంగా చూపించారు అంటూ వసుంధర గారు తనతో చెప్పారని వివి వినాయక్ వెల్లడించారు.అలా ఆరోజు వసుంధర గారు ఇచ్చిన ఈ కాంప్లిమెంట్ తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని ఓ ఇంటర్వ్యూ సందర్భంగా వివి వినాయక్ ఈ విషయాన్ని బయటపెట్టారు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus