Bhagavanth Kesari: ఐఫా నామినేషన్స్ లో సత్తా చాటిన బాలయ్య మూవీ.. ఏం జరిగిందంటే?

బాలయ్య  (Nandamuri Balakrishna) అనిల్ రావిపూడి (Anil Ravipudi)కాంబినేషన్ లో తెరకెక్కిన భగవంత్ కేసరి (Bhagavath Kesari) గతేడాది బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా ద్వారా దర్శకుడు అనిల్ రావిపూడి అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు. ఈ సినిమాలో బాలయ్య సింగిల్ రోల్ లోనే నటించినా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు. బాక్సాఫీస్ వద్ద భగవంత్ కేసరి మూవీ 70 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించింది. అయితే ఐఫా నామినేషన్స్ లో బాలయ్య అనిల్ భగవంత్ కేసరి సత్తా చాటడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

Bhagavanth Kesari

బెస్ట్ పిక్చర్, బెస్ట్ పర్ఫామెన్స్ ఇన్ అ లీడింగ్ రోల్ (మేల్), బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ పర్ఫామెన్స్ లీడింగ్ రోల్ (ఫిమేల్) కేటగిరీలలో ఈ సినిమా నామినేషన్స్ లో నిలవగా ఈ సినిమాకు ఎన్ని అవార్డులు వస్తాయో చూడాల్సి ఉంది. భగవంత్ కేసరి రాబోయే రోజుల్లో మరిన్ని సంచలనాలను క్రియేట్ చేయడం పక్కా అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

భగవంత్ కేసరి (Bhagavanth Kesari) సినిమా షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై తెరకెక్కగా ఆ బ్యానర్ లో తెరకెక్కిన బెస్ట్ సినిమాలలో ఈ సినిమా ఒకటిగా నిలిచింది. భగవంత్ కేసరి సినిమాకే నాలుగు అవార్డ్స్ వస్తే బాగుంటుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అభిమానుల కోరిక నెరవేరుతుందో లేదో మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది. భగవంత్ కేసరి సినిమాలో యాక్షన్ సీన్స్ సైతం స్పెషల్ గా ఉంటాయనే సంగతి తెలిసిందే.

భగవంత్ కేసరి సినిమాకు థమన్ (S.S.Thaman)   మ్యూజిక్ డైరెక్టర్ కాగా ఈ సినిమాలో పాటలు సైతం క్లిక్ అయ్యాయి. మరోవైపు ఈ ఏడాది బాలయ్య సినిమాలేవీ రిలీజయ్యే అవకాశాలు కనిపించడం లేదు. బాలయ్య బాబీ (Bobby)కాంబో మూవీ 2025 సంక్రాంతి రేసులో నిలుస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది బాలయ్య నటించిన రెండు సినిమాలు రిలీజ్ కాగా పొలిటికల్ కార్యక్రమాల వల్ల బాలయ్య బాబీ కాంబో మూవీ షూటింగ్ ఆలస్యమైందని తెలుస్తోంది.

వరుస సినిమాలతో ఓటీటీలలో సైతం సత్తా చాటుతున్న ప్రభాస్.. కానీ?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus