Unstoppable Promo: ‘మాటల్లో ఫిల్టర్ ఉండదు.. సరదాలో స్టాప్ ఉండదు..’

నందమూరి బాలకృష్ణతో ఓ టాక్ షోని ప్లాన్ చేసింది ‘ఆహా’. దీనికి ‘Unstoppable’ అనే పేరుని ఫిక్స్ చేశారు. నవంబర్ 4 నుంచి ఈ షోని ప్రసారం చేయనున్నారు. తొలిసారి బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తుండడంతో ఈ షోపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ‘నీకు చిత్తశుద్ధి ఉన్నప్పుడు.. నీకు లక్ష్యశుద్ధి ఉన్నప్పుడు.. నీకు సంకల్పశుద్ధి ఉన్నప్పుడు నిన్ను పంచభూతాలు కూడా ఆపలేవు..

మాటల్లో ఫిల్టర్ ఉండదు.. సరదాలో స్టాప్ ఉండదు.. సై అంటే సై.. నై అంటే నై.. వన్స్ ఐ స్టెప్ ఇన్.. దెబ్బకు థింకింగ్ మారిపోవాలా.. కలుద్దాం ఆహాలో’ అనే డైలాగ్ ను బాలయ్య తనదైన స్టైల్ లో చెప్పారు. ఇక టీజర్ విజువల్స్ ని చూస్తుంటే ఆశ్చర్యపోవాల్సిందే. ముందుగా ఓ స్పోర్ట్స్ బైక్, ఆ తరువాత స్పోర్ట్స్ కార్, గుర్రంపై కనిపించారు బాలయ్య. ఆయన స్టైలిష్ లుక్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.

ప్రశాంత్ వర్మ ఈ షోకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక బాలయ్య సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే ‘అఖండ’ సినిమాను పూర్తి చేశారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!


సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus