Balakrishna: బాలయ్య ఇలాగే తన కోపాన్ని కంట్రోల్లో పెట్టుకుంటారట..!

నందమూరి బాలకృష్ణ టాలీవుడ్లో ఓ స్టార్ హీరో. అలాగే మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో కూడా..! రియాలిటీకి వచ్చేసరికి అతను కోపిష్టి అనేది అందరి భావన. అయితే బాలయ్యకి ఉన్నది అహం అయితే కాదు ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి అతను పడే తాపత్రయం అనేది ఇండస్ట్రీ అంతా చెప్పే మాట. ఒక కామన్ కంటే కూడా చాలా నేచురల్ గా ఉంటారు బాలయ్య. కల్మషం లేని మనస్తత్వం. ఏది మనసులో పెట్టుకోకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటారు బాలయ్య.

Click Here To Watch Now

ఈ కోవలో ఆయన్ని విమర్శించే వ్యక్తులు కూడా చాలా మందే ఉన్నారు. కానీ ‘నవ్వే వాళ్ళని నవ్వనియ్ ఏడ్చే వాళ్ళని ఎడ్వనీయ్, పొగిడే వాళ్ళని పొగడనీయ్ తిట్టే వాళ్ళని తిట్టనీయ్, డోంట్ కేర్’ అనే థీమ్ నే నమ్ముకున్నారు బాలయ్య. అయితే బాలయ్య.. తాజాగా కోపం తగ్గించుకోవడానికి 5 టిప్స్ చెప్పి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు.

ఆయన చెప్పిన టిప్స్ ఏంటంటే..

1) మాట్లాడే ముందు కాస్త ఆలోచించి మాట్లాడాలి.

2)కోపం వచ్చినప్పుడు అంకెలు లెక్క పెట్టుకోవాలి.

3)అరుపులు కేకలు పెట్టకుండా అసలు ప్రాబ్లం ఏంటో ఆలోచించాలి.

4)మనసులో ఏమి పెట్టుకోకుండా ఏది ఉంటే అది బయటపెట్టి క్షమించేయాలి.

5) ఇది అన్నిటికంటే అతి ప్రాముఖ్యమైనది. తన కోపమే తన శత్రువు… తన శాంతమే తనకు రక్ష అని అన్నారు. ఎంత కోపం ఎక్కువ వస్తే మిగతా వాళ్ళ హెల్ప్ తీసుకుని శాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఎక్కడా కూడా కోపాన్ని ప్రదర్శించి అనవసర విషయాలకు… ఛాన్స్ ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండాలి.

ఇవండీ బాలయ్య బాబు చెప్పిన టిప్స్. అందుకే ఆయన ఎనర్జీ కూడా ‘అన్ స్టాపబుల్’ అనే విధంగా ఉంటుంది. ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి కూడా రెడీ అవుతున్నారు.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!


ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus