Balakrishna, Jr NTR: నందమూరి ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న రోజు వచ్చేసిందా?

  • July 5, 2022 / 11:22 AM IST

కళ్యాణ్ రామ్ హీరోగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కిన బింబిసార సినిమా వచ్చే నెల 5వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. తాజాగా బింబిసార ట్రైలర్ రిలీజ్ కాగా కళ్యాణ్ రామ్ ఖాతాలో కూడా మరో బ్లాక్ బస్టర్ గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కళ్యాణ్ రామ్ సినీ కెరీర్ లో అతనొక్కడే, పటాస్ మినహా ఇతర సినిమాలన్నీ యావరేజ్ లేదా ఫ్లాప్ సినిమాలుగా నిలిచాయి.

అయితే త్వరలో బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుండగా ఈ ఈవెంట్ కు బాలయ్య ఎన్టీఆర్ రానున్నారని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ ఒకే వేదికపై కనిపించలేదు. గతేడాది బాలయ్య ఒక సందర్బంలో టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ ప్లస్ కావచ్చని మైనస్ కావచ్చని కామెంట్లు చేయగా ఆ కామెంట్లు చర్చనీయాంశం అయ్యాయి. బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ మధ్య గ్యాప్ వచ్చిందని ప్రచారం జరిగింది.

అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లలో మాట్లాడుతూ బాల బాబాయ్ తో మల్టీస్టారర్ సినిమాలో నటించాలని ఉందని తన మనసులోని అభిప్రాయాన్ని వెల్లడించారు. బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏం జరగబోతుందో చూడాల్సి ఉంది. అటు అఖండతో బాలయ్య ఇటు ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లను ఖాతాలో వేసుకోగా కళ్యాణ్ రామ్ కు బింబిసార సినిమాతో ఆ స్థాయి సక్సెస్ దక్కుతుందో లేదో చూడాల్సి ఉంది.

40 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన బింబిసార సినిమా ట్రైలర్ గ్రాండ్ గా ఉంది. బింబిసార ట్రైలర్ కు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. కళ్యాణ్ రామ్ నటన బాగుందని నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర కళ్యాణ్ రామ్ కు బాగా సూట్ అయిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. కళ్యాణ్ రామ్ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. బింబిసార సినిమా విడుదలైన తర్వాత కళ్యాణ్ రామ్ కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటిస్తారేమో చూడాలి.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus