క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో బన్నీ హీరోగా పుష్ప సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆర్య, ఆర్య 2 సినిమాల తరువాత బన్నీ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు పార్టులుగా తెరకెక్కుతోందని ఈ సినిమా నిర్మాతలలో ఒకరు స్పష్టం చేశారు. బాహుబలి, కేజీఎఫ్, ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలు రెండు పార్టులుగా తెరకెక్కాయి. బాహుబలి, కేజీఎఫ్ సినిమాలు విజువల్ వండర్స్ కాబట్టి రెండు పార్టులుగా తెరకెక్కినా ఆ సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది.
ఎన్టీఆర్ బయోపిక్ రెండు పార్టులుగా తెరకెక్కగా పార్ట్ 1 ఫ్లాప్ కావడంతో ఆ ప్రభావం పార్ట్ 2పై పడింది. ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాకు భారీగా నష్టాలు వస్తే ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాకు మాత్రం దారుణంగా కలెక్షన్లు వచ్చాయి. పుష్ప రెండు పార్టులుగా తెరకెక్కుతున్న నేపథ్యంలో పుష్ప పార్ట్ 1 ఫ్లాపైతే పార్ట్ 2 పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మరి కొందరు నెటిజన్లు ఎన్టీఆర్ బయోపిక్ రిజల్ట్ మరిచావా బన్నీ..? అని కామెంట్లు పెడుతున్నారు.
పుష్ప రెండు పార్టులు దాదాపు 225 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. పుష్ప నిర్మాతలు అల వైకుంఠపురములో సినిమాతో అల్లు అర్జున్ కు వచ్చిన క్రేజ్ ను క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారా..? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. కథ డిమాండ్ చేయకపోయినా పుష్ప సినిమాను బిజినెస్ కోసం రెండు భాగాలుగా తెరకెక్కిస్తే మాత్రం ఆ ప్రభావం సినిమా రిజల్ట్ పై పడే అవకాశం ఉంది.
Most Recommended Video
థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!