నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ‘అఖండ 2’ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతుంది. డిసెంబర్ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘అఖండ’ పెద్ద హిట్ అవ్వడం వల్ల.. ‘అఖండ 2’ పై భారీ అంచనాలు ఉన్నాయి. కచ్చితంగా ఈ సినిమా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుంది అని అంతా భావిస్తున్నారు. ఇక ‘అఖండ 2’ తర్వాత బాలయ్య చేయబోయే సినిమాలు కూడా ఫిక్స్ అయిపోయాయి. ‘వీరసింహారెడ్డి’ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో మాస్ మూవీ చేయడానికి బాలకృష్ణ రెడీ అయ్యారు.
అలాగే క్రిష్ దర్శకత్వంలో కూడా బాలయ్య ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ అనిల్ రావిపూడి, బాబీ వంటి దర్శకులతో సినిమాలు చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. బాలయ్య – గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందే ప్రాజెక్టు చేతులు మారినట్లు టాక్ వినిపిస్తుంది. ముందుగా ఈ క్రేజీ ప్రాజెక్టుని ‘ఎన్ ఎల్ వి సినిమాస్’ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తారు అంటూ వార్తలు వినిపించాయి. అది నిజం కూడా.
అయితే ఇప్పుడు ఆయన ఆర్థిక సమస్యల్లో ఉన్నారు. పైగా రవితేజ, నాని వంటి హీరోలతో పెద్ద ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు. దీంతో బాలయ్య సినిమాపై ఆయన ఫుల్ ఫోకస్ పెట్టలేకపోతున్నారు అని తెలుస్తుంది. అందుకే ఈ ప్రాజెక్టుని రామ్ చరణ్ ‘పెద్ది’ నిర్మాత అయిన వెంకట్ సతీష్ కిలారు టేకప్ చేసినట్లు సమాచారం. తన ‘వ్రిద్ది సినిమాస్’ బ్యానర్ పై వెంకట్ సతీష్ కిలారు ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మించబోతున్నారట. త్వరలోనే పూజా కార్యక్రమాలతో ఈ ప్రాజెక్టు ప్రారంభం కానుంది.