ఫ్లాష్ బ్యాక్ : ఆ సినిమా ఫలితాన్ని ముందే అంచనా వేసిన బాలయ్య.. కానీ..!

  • January 29, 2022 / 12:25 PM IST

నటసింహం నందమూరి బాలకృష్ణది ముక్కుసూటి మనస్తత్వం. ఆయన ఏమనుకున్నాడో అది చెప్పేస్తాడు.. ఏది చేయాలనుకుంటాడో అది చేసేస్తుంటాడు. మనస్ఫూర్తిగా జీవించే మనిషి. కానీ ఫ్లాష్ బ్యాక్ కు వెళ్తే.. ఓ సినిమాని ఇష్టం లేకుండా చేసి ప్లాప్ ను మూటకట్టుకున్నాడట. విషయంలోకి వెళ్తే..ఒకప్పటి స్టార్ డైరెక్టర్ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో బాలకృష్ణ ‘అన‌సూయ‌మ్మ‌గారి అల్లుడు’ అనే సినిమా చేసాడు. అది మంచి విజయం సాధించింది. దాంతో ఇదే కాంబోలో ఇంకో సినిమాని నిర్మించాలని సీనియర్ ఎన్టీఆర్ భావించారట.

అందుకోసం పరుచూరి బ్రదర్స్ ను పిలిపించి కోదండ రామిరెడ్డికి ఓ కథ వినిపించారు. అది విన్న కోందండ రామిరెడ్డి గారు కథ నచ్చలేదని ఎన్టీఆర్ తో చెప్పారు. అప్పటికి ఏమీ అనలేకపోయిన అన్నగారు… కొన్ని రోజుల తర్వాత కోదండ రామిరెడ్డికి ఫోన్ చేసి.. ‘ఆ కథ మాకు ఎందుకో నచ్చింది. మీరు డైరెక్ట్ చేసి పెడతారా?’ అని అడిగారట. పెద్దాయన ఫోన్ చేసి మరీ అడగడంతో కోదండ రామిరెడ్డి కాదనలేకపోయారు. తర్వాత బాలకృష్ణకి కథ వినిపించగా ఆయనకి కూడా నచ్చలేదు.

కానీ నాన్నగారి మాట కాదనలేక చేసేద్దాం అని డిసైడ్ అయ్యాడు. అదే ‘తిర‌గ‌బ‌డ్డ తెలుగుబిడ్డ‌’. ఈ చిత్రం షూటింగ్ టైములో ఓ సందర్భంలో ‘ వన్ మోర్ టేక్’ అని దర్శకుడు కోదండరామిరెడ్డి బాలయ్యతో అన్నారట. అందుకు బాలయ్య… ‘ప్లాప్ అయ్యే సినిమాకి ఇంకో టేక్ ఎందుకు లెండి.. ఓకె చేసెయ్యండి అన్నాడట’. బాలయ్య అన్నట్టుగానే ఆ సినిమా ప్లాప్ అయ్యింది. పెద్ద స్టార్ కొడుకులు అన్నాక…

వాళ్ళ తండ్రి అన్నాక, నచ్చకపోయినా ఒక్కోసారి సినిమాలు చేయాల్సి వస్తుందేమో..! ఆ సినిమా ఫలితాన్ని ముందే ఊహించప్పటికీ బాలయ్య… ఎస్కేప్ అవ్వలేకపోయాడు.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus