‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్త తెలిసిన దగ్గర్నుండీ సినీ పరిశ్రమకు సంబంధం లేని వారు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ట్వీట్లు వేయడం మనం చూస్తున్నాం. కీరవాణి సంగీత సారథ్యంలో రూపొందిన ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించగా.. కీరవాణి తనయుడు కాలభైరవ, బిగ్ బాస్3 విన్నర్ అయిన రాహుల్ సిప్లిగంజ్ కలిసి ఈ పాటను ఎంతో ఎనర్జిటిక్ గా పాడారు.
మాస్ పాట అయినప్పటికీ తెలుగువారంతా ఎంతో హుషారుగా పాడుకునే పాట ఇది. సినిమాలో కూడా ఈ పాట వచ్చినప్పుడు థియేటర్లలో జనాలు సీట్లలో కూర్చోలేదు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. చూడటానికి కూడా ఈ పాట అంత బాగుంటుంది. ప్రేమ్ రక్షిత్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ పాటకు ఎన్టీఆర్, రాంచరణ్ లు.. తమ ఎనర్జిటిక్ డాన్స్, గ్రేస్ తో ఈ పాటను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లారు అన్నది వాస్తవం. విదేశీయులు కూడా ఈ పాటకు ఎక్కువగా రీల్స్ వంటివి చేశారు అంటే వాళ్ళ చరణ్, ఎన్టీఆర్ ల కాంట్రిబ్యూషన్ చాలా వరకు ఉంటుంది.
ఇండియన్ సినీ ప్రేక్షకులు మరీ ముఖ్యంగా నందమూరి, మెగా అభిమానులు కాలర్ ఎగరేసుకోవాల్సిన సమయం ఇది. ఉదయం నుండి ఈ పాటకు ఆస్కార్ లభించినందుకు గాను స్టార్లు అంతా సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్లు వంటివి వేస్తున్నారు. ఈ పాటకు క్రెడిట్స్ ఇవ్వాల్సిన వారందరి పేర్లు ప్రస్తావిస్తున్నారు. ఎన్టీఆర్, రాంచరణ్ లను ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. చిరు .. చరణ్ తో ఎన్టీఆర్, చరణ్ లను అభినందిస్తూ ట్వీట్ వేశారు. పవన్ కళ్యాణ్ కూడా ఓ లెటర్ రిలీజ్ చేశారు. అందులో ఇద్దరి హీరోల పేర్లు ప్రస్తావించారు.
ఇదే క్రమంలో బాలయ్య కూడా ఓ లెటర్ రిలీజ్ చేశారు. కానీ అందులో ప్రత్యేకంగా ఎన్టీఆర్ పేరు ప్రస్తావించలేదు. హీరోలిద్దరి పేర్లు ప్రస్తావించలేదు అనుకోండి. అది వేరే విషయం. కానీ తమ నందమూరి బిడ్డ ఎన్టీఆర్ కూడా ఇందులో భాగమైనందుకు ఈ శుభ సందర్భంలో అతని(జూ.ఎన్టీఆర్) పేరు చెబితే అభిమానులు ఇంకా సంతోషిస్తారు కదా. కానీ బాలయ్య అలా చేయలేదు. దీని వల్ల వీరి ఎన్టీఆర్ – బాలయ్య మధ్య గ్యాప్ ఉందంటూ వస్తున్న వార్తలకు ఇంకా బలం చేకూరుతున్నట్టు అవుతుంది.
రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!
2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్