Balayya Babu: షోలో బాలయ్య పెట్టుకున్న కళ్లద్దాలు ఏ బ్రాండ్, వాటి ధర ఏంతంటే..?

నటసింహ నందమూరి బాలకృష్ణ మరి కొద్ది గంటల్లో ‘వీరసింహా రెడ్డి’ గా ప్రేక్షకాభిమానుల ముందుకు రానున్నారు.. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది.. శృతి హాసన్ తొలిసారి బాలయ్యతో జత కడుతుంది.. లాల్, ‘దునియా’ విజయ్, వరలక్ష్మీ శరత్ కుమార్, హనీ రోజ్, అజయ్ ఘోష్ కీలక పాత్రల్లో నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న చిత్రం భారీ స్థాయిలో విడుదల కానుంది.

ఇక బాలయ్య బాబు ‘వీర సింహా రెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ‘అన్‌స్టాపబుల్’ షో షూటింగ్‌లో పాల్గొంటున్నారు.. పవన్ కళ్యాణ్ తర్వాత ప్లాన్ చేసిన లేటెస్ట్ ఎపిసోడ్‌లో ‘వీరసింహా రెడ్డి’ టీమ్ సందడి చేశారు. డైరెక్టర్, వరలక్ష్మీ శరత్ కుమార్, హనీ రోజ్, నిర్మాతలు నవీన్, రవి శంకర్ తదితరులు ఈ షోలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు బయటకు రాగా నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే టీం అంతా కనిపించారు కానీ శృతి హాసన్ మాత్రం అనారోగ్యం కారణంగా రాలేదని తెలుస్తోంది.

ప్రొఫెషన్ సంగతి పక్కన పెడితే.. పర్సనల్‌గా బాలయ్య స్టైలింగ్ భలే ఉంటుంది.. అసెంబ్లీ, హిందూపూర్ నియోజకవర్గ పర్యటనలైతే వైట్ అండ్ వైట్‌లో మెరిసిపోతుంటారు.. ఇక నార్మల్‌గా డిజైనింగ్ షర్ట్స్, ఫుల్ హ్యాండ్స్ ఫోల్డ్ చెయ్యకుండా ఎడమ చేతి మణికట్టుపైన వాచ్ పెట్టడం బాలయ్య స్టైల్.. సందర్భాన్ని బట్టి డ్రెస్సింగ్ స్టైల్ మారుస్తుంటారు.. ఇక టాక్ షోలో వాడే కాస్ట్యూమ్స్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు.. స్టైలింగ్‌తో అదరగొట్టేస్తున్నారు.. ఇక ‘అన్‌స్టాపబుల్’ షో లేటెస్ట్ ఎపిసోడ్‌లో బాలయ్య ట్రెడిషనల్ వేర్‌లో మెరిసిపోయాడు.

మన తెలుగు, సంసృతీ, సాంప్రదాయాలకు బాలయ్య ఎంతో విలువ ఇస్తుంటాడనే సంగతి తెలిసిందే. బాలయ్య బాబు స్టైలిష్ గాగుల్స్‌తో కనిపించాడు. ఇది పాపులర్ గుస్సి (GUCCI) బ్రాండ్‌కి చెందింది. దీని కాస్ట్ రూ.51,908. ‘వీరసింహా రెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనూ బాలయ్య తన స్టైల్‌లో ఆకట్టుకున్నారు.. సాంప్రదాయ ధోతీ, బ్లేజర్‌తో కనిపించిన బాలయ్య పెట్టుకున్ కార్టియర్ శాంటాస్ 100 స్కెలెటిన్ (Cartier Santos 100 Skeleton) బ్రాండ్‌కి చెందిన వాచ్ గురించి, దాని కాస్ట్ గురించి వార్తలు వైరల్ అయ్యాయి.. దీని ధర రూ. 26,90,000..

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus