బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న అఖండ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. అఖండ సినిమా ఎప్పుడు విడుదలైనా కొత్త రికార్డులను క్రియేట్ చేయడం గ్యారంటీ అని చెప్పవచ్చు. అయితే ఈ సినిమా దసరాకు రిలీజయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని గతంలో వార్తలు వచ్చాయి. ఒక ఇంటర్వ్యూలో బాలకృష్ణ మాట్లాడుతూ అఖండ సినిమాను అక్టోబర్ లో రిలీజ్ చేయాలని భావిస్తున్నామని చెప్పుకొచ్చారు. అయితే దసరాకు సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు అఖండ మేకర్స్ నుంచి ప్రకటన రాకపోవడంతో దసరా బరిలో బాలయ్య లేనట్టేనని తెలుస్తోంది.
అక్టోబర్ 8వ తేదీన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రిలీజ్ కానుండగా అక్టోబర్ 14వ తేదీన మహాసముద్రం, అక్టోబర్ 15వ తేదీన రౌడీ బాయ్స్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఈ సినిమాలతో పాటు అక్టోబర్ 15వ తేదీన నాగశౌర్య నటించిన వరుడు కావలెను కూడా రిలీజ్ కానుందని సమాచారం. ఆర్ఆర్ఆర్ దసరాకు రిలీజ్ కాదని మేకర్స్ ప్రకటించడంతో చిన్నహీరోల సినిమాలు, మిడిల్ రేంజ్ హీరోల సినిమాలు దసరాకు క్యూ కట్టాయి.
అఖండ దసరా సీజన్ ను మిస్ చేసుకుంటే మరో మంచి డేట్ దొరకడం అంత తేలిక కాదనే చెప్పాలి. ఆచార్య, అఖండ సినిమాల రిలీజ్ డేట్లకు సంబంధించి క్లారిటీ వస్తే బాగుంటుందని చిరంజీవి, బాలకృష్ణ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అఖండ మూవీ ఏకంగా 70 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోందని తెలుస్తోంది.