నటసింహ నందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతికి ‘వీరసింహా రెడ్డి’ గా ప్రేక్షకాభిమానుల ముందుకు వచ్చాడు.. యంగ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో సిస్టర్ సెంటిమెంట్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది.. తండ్రీ కొడుకులుగా బాలయ్య ద్విపాత్రాభినయం ఫ్యాన్స్‌కి సాలిడ్ ఫెస్టివల్ ట్రీట్ ఇచ్చింది.. ఈ చిత్రం బాలయ్య కెరీర్‌లో, అభిమానుల మనసుల్లో ఓ మెమరబుల్ మూవీగా మిగిలిపోతుంది అనడంలో అతిశయోక్తి లేదు..
శృతి హాసన్ తొలిసారి బాలయ్యతో జతకట్టగా.. లాల్, ‘దునియా’ విజయ్, వరలక్ష్మీ శరత్ కుమార్, హనీ రోజ్, అజయ్ ఘోష్ కీలకపాత్రల్లో కనిపించారు. ప్రీమియర్స్ నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకుని.. తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో విడుదలై.. నటసింహ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టి.. బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ‘వీరసింహా రెడ్డి’ గా తన నటవిశ్వరూపాన్ని చూపించాడు బాలయ్య. ఎప్పటిలానే తన పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో థియేటర్లలో డైనమెట్స్ పేల్చాడు. వయసు 60 పైబడినా కానీ 30 ఏళ్ల యువకుడిలా స్టెప్స్ వేసి సర్‌ప్రైజ్ చేశాడు.
సినిమా పరిశ్రమ వారు కూడా 2023 సంక్రాంతికి బాలయ్య సినిమతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు కొత్త ఉత్సాహం, పండుగ వాతావరణం వచ్చాయంటూ సామాజిక మాధ్యమాల ద్వారా పోస్టులు చేశారు. ఇదిలా ఉంటే.. తెలుగు రాష్ట్రాల్లోని పల్లెటూళ్లల్లో కూడా వీక్ డేస్‌లోనూ డీసెంట్ ఫిగర్స్ రాబడుతున్న బాలయ్య సినిమాని హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మెయిన్ థియేటర్ సంధ్య 35 MMలో ఫిబ్రవరి 2 వరకు అంటే 22 రోజుల పాటు ప్రదర్శించి తీసేస్తున్నారు. దీంతో బాలయ్య ఫ్యాన్స్ మైత్రీ మూవీస్ వారి మీద అసహనం వ్యక్తం చేస్తున్నారు.
రిలీజ్ అయిన నాలుగో రోజు నుండి కలెక్షన్స్ బయటకి చెప్పలేదు.. సరైన ప్రమోషన్స్ చేయలేదు.. థియేటర్స్ కూడా సరిగా ఇవ్వకపోయినా మౌత్ టాక్ కారణంగా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మరో వారం మెయిన్ థియేటర్ ఉంచితే బాలయ్య పేరిట హ్యాట్రిక్ రికార్డ్ ఉండేది.. క్రాస్ రోడ్స్‌లో ‘నరసింహ నాయుడు’ (2001), ‘అఖండ’ (2021) కోటి రూపాయల గ్రాస్ రాబట్టాయి. ‘వీరసింహా రెడ్డి’ మరి కొద్ది రోజుల్లో కోటి కలెక్ట్ చేసేది.. అలా అయితే క్రాస్ రోడ్స్‌లో కోటి రూపాయ గ్రాస్ పరంగా హ్యాట్రిక్ కొట్టిన రికార్డ్ బాలయ్య బాబుదే అయ్యేది అంటూ అభిమానులు నిర్మాతల మీద ఫైర్ అవుతున్నారు..
2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!
షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?