ఈ మధ్య కాలంలో ఏ సినిమా టైటిల్ గురించి చర్చ జరగని స్థాయిలో బాలయ్య గోపీచంద్ మలినేని మూవీ టైటిల్ గురించి చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అఖండ సినిమా సంచలన విజయం సాధించడంతో ఉత్సాహంగా ఉన్న బాలయ్య అభిమానులు బాలయ్య కొత్త సినిమాలకు సంబంధించిన అప్ డేట్ల కోసం ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. బాలయ్య గోపీచంద్ మూవీకి ఎన్నో టైటిల్స్ వినిపించగా చివరకు జై బాలయ్య అనే టైటిల్ ఫిక్స్ అయిందని తెలుస్తోంది.
ఎన్నో టైటిల్స్ ను పరిశీలించిన మేకర్స్, బాలకృష్ణ చివరకు ఈ టైటిల్ కు ఓటేశారని సమాచారం అందుతోంది. జూన్ 10వ తేదీన బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ టైటిల్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ అయితే ఉంది. అనంతపురం బ్యాక్ డ్రాప్ లో పక్కా మాస్ సబ్జెక్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్ కాగా థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.
సినిమాలో ప్రేక్షకులకు నచ్చే పొలిటికల్ పంచ్ లతో పాటు అఖండ తరహా ఎలివేషన్లు కూడా ఉంటాయని తెలుస్తోంది. జై బాలయ్య క్యాచీ టైటిల్ అని బాలయ్య అభిమానులు సైతం ఫీలవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన బాలయ్య లుక్ కు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ప్రకటిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
బాలయ్య ఏడాదికి కనీసం ఒక సినిమా విడుదలయ్యే విధంగా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. రాబోయే రెండేళ్లలో బాలయ్య నుంచి మూడు సినిమాలు రిలీజ్ కానున్నాయని తెలుస్తోంది. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఒక సినిమాకు, బోయపాటి శ్రీను డైరెక్షన్ లో ఒక సినిమాకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. బాలయ్య సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి.
Most Recommended Video
‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!