మన ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీలన్నీట్లో వీకేస్ట్ అంటే భోజపురి లేదా బంగ్లాదేశ్ సినిమా ఇండస్ట్రీలని చెబుతుంటారు. ఆ రెండు సినిమా ఇండస్ట్రీలకంటే కూడా వీక్ ఏదైనా ఉంది అంటే అది పాకిస్తాన్ ఫిలిమ్ ఇండస్ట్రీ. ఇప్పటివరకూ పాకిస్తాన్ నుంచి ఆకట్టుకొనే స్థాయి సినిమా ఒక్కటి కూడా రాలేదంటేనే వాళ్ళ ఇండస్ట్రీ పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. అలాంటి పాకిస్తాన్ లో మన ఇండియన్ సినిమాలే ఎక్కువగా ఆడుతుంటాయి. మన తెలుగు సినిమాల హిందీ డబ్బింగ్ వెర్షన్ ను కూడా థియేటర్లలో ప్రదర్శిస్తుంటారు. అలాంటి పాకిస్తాన్ ఇప్పుడు మన ఇండియన్ సినిమాలను బ్యాన్ చేసింది. అంటే ఇకపై పాకిస్తాన్ లో ఇండియన్ మూవీస్ రిలీజ్ అవ్వవన్నమాట.
ఇది పాకిస్తాన్ తీసుకున్న పిచ్చి నిర్ణయాల్లో ఒకటని చెప్పొచ్చు. పాకిస్తాన్ లో థియేటర్లు రన్ అవ్వడానికి ముఖ్యకారణమే మన ఇండియన్ సినిమాలు. అలాంటి ఇండియన్ మూవీస్ ను బ్యాన్ చేసి వాళ్ళ బిజినెస్ కి వాళ్ళే గండికొట్టుకున్నారు. నిజానికి మనవాళ్లే పాకిస్తాన్ లో తమ సినిమాలు రిలీజ్ చేయకూడదు అని నిర్ణయం తీసుకున్నారు. అసలే అక్కడ రిలీజ్ అవ్వడం వల్ల మనకి పెద్దగా వచ్చే లాభాలు లేకపోగా.. సినిమా పైరసీ అక్కడ్నుంచే ఎక్కువగా అవుతుంది. సో, ఈ పాకిస్తాన్ బ్యాన్ పుణ్యమా అని పైరసీ తగ్గినట్లే.