Bandla Ganesh: తన కూతురిని ప్రేక్షకులకు పరిచయం చేసిన బండ్లన్న..!

  • July 6, 2021 / 09:02 PM IST

బండ్లగణేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇతను ఎక్కడుంటే అక్కడ సందడే అన్నట్టు ఉంది. ఓ కమెడియన్ గా కెరీర్ ను మొదలుపెట్టిన ఈయన అటు తర్వాత ఎవ్వరూ ఊహించని విధంగా నిర్మాతగా మారాడు. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, చరణ్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అటు తర్వాత నిర్మాణ రంగానికి దూరమయ్యి రాజకీయాల్లో అడుగుపెట్టాడు. అక్కడ ఇతనికి సీటు దొరికింది లేదు..

కానీ ప్రచారంలో జోరుగా పాల్గొని ప్రేక్షకులకు మీమ్స్ స్టఫ్ ను అందించాడు.త్వరలో జరగనున్న ‘మా’ ఎన్నికల్లో ప్రకాష్ ప్యానెల్ లో సభ్యుడిగా చేరాడు బండ్ల గణేష్. ఇదిలా ఉండగా.. తాజాగా ఇతను తన కూతురితో కలిసి ఓంకార్ హోస్ట్ చేస్తున్న ‘సిక్స్త్ సెన్స్ సీజన్ 4’ కి హాజరయ్యాడు. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతుంది. బండ్ల గణేష్ కూతురి పేరు జనని అని తెలిపాడు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ..’నా కూతురికి 18 ఏళ్ళు.

ఇన్నేళ్ళలో నా కూతురు కోరిన కోరికలు రెండే రెండు.ఒకటి.. ‘నాన్నా పవన్ కళ్యాణ్ గారితో మళ్లీ నువ్వు బ్లాక్ బస్టర్ సినిమా ఎప్పుడు తీస్తావ్?’ అని ఇంకోటి.. ‘ఓంకార్ అన్నయ్య షోకి వెళ్తే నన్ను కూడా తీసుకెళ్లు అని’, అందుకే తీసుకుని వచ్చాను. అది నీకు ఉన్న క్రెడిబిలిటీ..’ అంటూ చెప్పుకొచ్చాడు బండ్ల గణేష్.

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus