ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణ ఇటీవల యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ను స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూ లో గణేష్ ను రాధాకృష్ణ రకరకాలుగా ప్రశ్నించారు. గణేష్ కూడా వీలైనంత వెరైటీగా జవాబులిచ్చారు.పవన్ కళ్యాణ్.. ఎన్టీఆర్ నిన్ను కొన్నాళ్లు ఎందుకు దూరం పెట్టారు? పూరి జగన్నాధ్, కృష్ణవంశీలతో గొడవలెందుకు వచ్చాయి? అంటూ తనదైన శైలిలో గణేష్ ను గుచ్చి గుచ్చి ప్రశ్నించారు ఆర్కే. తాను తీసిన సినిమాల్లో తనకు నష్టం తెచ్చిన ఒకే ఒక్క చిత్రం “బాద్ షా” అని.. మెగా ఫామిలీ సపోర్ట్ వల్ల “గోవిందుడు అందరివాడేలే” చిత్రానికి నష్టం రాలేదని వివరించి.. పరోక్షంగా కృష్ణవంశీని దెప్పి పొడిచాడు గణేష్. అంతా బాగానే ఉంది. గణేష్ చెప్పిన విషయాల్లో వాస్తవాలు ఎన్ని.. అన్న విషయాన్ని పక్కన పెడితే.. సచిన్ జోషి గురించి మాత్రం గణేష్ ను రాధాకృష్ణ అడగకపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
సచిన్ జోషితో గణేష్ “నీ జతగా నేనుండాలి” అనే సినిమా తీసాడు. ఈ సినిమాకు సచిన్ హీరో మాత్రమే కాదు షాడో ప్రొడ్యూసర్ కూడా. గణేష్ తీసిన “గోవిందుడు అందరివాడేలే” చిత్రానికి మొత్తం ఫైనాన్స్ సమకూర్చింది కూడా సచినే. అయితే.. ఈ రెండు సినిమాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల్లో ఇద్దరికీ పూర్తిగా చెడింది. సచిన్ ఫిర్యాదు మేరకు గణేష్ కు అరెస్ట్ వారెంట్స్ జారీ చేయడం సైతం జరిగింది. ఒక దశలో.. గోవా గుట్కా సామ్రాజ్యాధినేత అయిన సచిన్.. ముంబై సెటిల్ మెంట్స్ తరహాలో.. గణేష్ ను కిద్నాప్ చేయించాడని సైతం వార్తలొచ్చాయి. ఈమధ్యే.. ట్విట్టర్ లో గణేష్ పై భయంకరంగా దాడి చేసాడు సచిన్.
కానీ.. ఈ విషయమై పొరపాటున కూడా ప్రశ్నించలేదు ఆర్కే. రాధాకృష్ణ చేసే ఇంటర్వూస్ కు మంచి క్రేజే ఉంది. ఏ విషయాన్నయినా ఆయన కుండ బద్దలు గొట్టి ప్రశ్నిస్తారనే పేరుంది ఆయనకు. కానీ.. గణేష్ ఇంటర్వ్యూ వల్ల ఈ విషయంలో ఆయనకు కొంచెం మచ్చ వచ్చే అవకాశం ఉంది. బహుశా గణేష్.. సచిన్ జోషితో వివాదాల గురించి ప్రశ్నించవద్దని ముందే ఇంటర్వ్యూ కో ఆర్డినేటర్స్ ను రిక్వస్ట్ చేసి ఉండొచ్చు.
అయినా సరే.. ఆ విషయమై గణేష్ ని ఆర్కే ప్రశ్నించి ఉండాల్సిందని.. ఆ వ్యవహారం కోర్టులో ఉన్నందున తాను మాటాడడం బాగుండదని గణేష్ చెప్పి ఉంటె సరిపోయేదనే కామెంట్లు ఫిలింనగర్ లో వినిపిస్తున్నాయి!!
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.