Bandla Ganesh: ఏడాదిన్నర పాటు జైలు శిక్ష.. చిక్కుల్లో పడ్డ బండ్లన్న!

  • February 14, 2024 / 03:40 PM IST

టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్, నిర్మాత అయిన బండ్ల గణేష్‌ గురించి తెలియని వారంటూ ఉండరు. అతను కొన్ని సినిమా వేడుకల్లో, పబ్లిక్ ఈవెంట్స్ లో చేసే వింత కామెంట్స్ పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉంటాయి. సోషల్ మీడియాలో కూడా బండ్ల గణేష్ చాలా యాక్టివ్ గా ఉంటారు. సామాజిక అంశాల పై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు. తాజాగా అతనికి జైలు శిక్ష పడిందనే వార్త చర్చనీయాంశం అయ్యింది.

ఎందుకంటే అతని పై చెక్‌బౌన్స్‌ కేసు రిజిస్టర్ అవ్వడమే కారణమని తెలుస్తుంది. ఈ క్రమంలో అతనికి ఏడాది పాటు జైలు శిక్ష కూడా విధించిందట న్యాయస్థానం. పూర్తి వివరాల్లోకి వెళితే.. గతంలో పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ ఒకరికి రూ.1.2 కోట్లు చెక్ ఇవ్వడం జరిగింది. అయితే అది బౌన్స్ అయ్యిందట. అందుకే అతను కోర్టుని ఆశ్రయించినట్లు తెలుస్తుంది. ఇదివరకే విచారణకి హాజరవ్వాలని బండ్ల గణేష్ కి కోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ..

అతను లెక్కచేయకుండా లైట్ తీసుకోవడంతో కోర్టు ఇలా తీర్పు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక ఈ కేసులో అప్పీలు చేసుకునేందుకు గాను బండ్ల గణేష్‌కి నెల రోజుల పాటు గడువు ఇచ్చిందట న్యాయస్థానం. ఒంగోలు న్యాయస్థానం ఇలా తీర్పు ఇచ్చిందట. అలాగే ఒంగోలుకు చెందిన పోలీసులు బండ్ల గణేష్ ని (Bandla Ganesh) అరెస్ట్ చేయడానికి కూడా ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈ కేసు విషయంలో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

ఈగల్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాల్ సలామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus