ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో ఒక తమిళ్ సినిమా దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. కమెడియన్ యోగిబాబు నటించిన మండేలా సినిమాను భాషతో సంబంధం లేకుండా అన్ని వర్గాల వారు చూసేస్తున్నారు. కామెడీ ప్లస్ పొలిటికల్ సెటైరికల్ గా తెరకెక్కిన ఆ సినిమా కాన్సెప్ట్ ఇప్పటికే చాలామంది తెలుగు నిర్మాతలను ఆకర్షించింది. తెలుగులో కూడా ఒక టాప్ కమెడియన్ తో ఆ సినిమా చేస్తే హిట్ అవుతుందని ఆలోచిస్తున్నారని కూడా రూమర్స్ వచ్చాయి.
గ్రామంలోని రెండు కులాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్న తరుణంలో పంచాయితీ ఎన్నికల్లో ఊహించని విధంగా రెండు కులాల ఓట్లు సమానంగా వస్తాయి. ఇక చాలా తక్కువ కులం వాడని చూసే ఒక క్షురకుడి ఓటు కీలకంగా మారుతుంది. సినిమాలో ఇదే అసలు పాయింట్. కొత్త దర్శకుడు అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమాను కామెడీగా ఎంతో విభిన్నంగా తెరకెక్కించగా సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక సినిమాను తెలుగులో బండ్ల గణేష్ తో రీమేక్ చేయనున్నట్లు టాక్ రాగా మళ్ళీ ఆయన తప్పుకున్నట్లు కూడా రూమర్స్ వచ్చాయి.
ఇక ఆ రూమర్స్ కు చెక్ పెడుతూ.. ఒప్పుకుంటే కదా తప్పుకోవడానికి.. అని ఒక్క ట్వీట్ తో ఫైనల్ క్లారిటీ ఇచ్చేశాడు. అసలు బండ్ల గణేష్ వద్దకు అలాంటి ఆఫర్ ఏమి రాలేదని చాలా క్లియర్ గా అర్ధమయ్యింది. ఇక ఈ సినిమా అనిల్ సుంకర నిర్మాతగా సునీల్ హీరోగా చేసే ఛాన్స్ ఉన్నట్లు మరొక రూమర్ వస్తోంది. మరి ఆ న్యూస్ ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.