Bandla Ganesh: విజయ్ విషయంలో పూరి, చార్మిలను టార్గెట్ చేశారా?

నిప్పు లేనిదే పొగ రాదంటారు అలాగే ఎక్కడో ఒకచోట ఏవో ఒక మనస్పర్ధలు ఉంటేనే ఒకరి గురించి పెద్ద ఎత్తున వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే బండ్ల గణేష్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలిచారు. విజయ్ దేవరకొండతో బండ్ల గణేష్ కు ఏ విధమైనటువంటి పరిచయం లేదు. వీరిద్దరూ కలిసి సినిమాలు కూడా చేయలేదు. కానీ విజయ్ దేవరకొండ స్పీచ్ పై బండ్ల గణేష్ స్పందించడం గమనార్హం.

లైగర్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా విజయ్ దేవరకొండ మా తాత మా నాన్న ఎవరో తెలియదు కానీ నాపై ఇలాంటి ప్రేమను చూపిస్తున్నారు అంటూ మాట్లాడారు.ఇక విజయ్ దేవరకొండ మాట్లాడిన ఈ వ్యాఖ్యలపై బండ్ల గణేష్ స్పందిస్తూ తండ్రులు తాతలు ఉంటే సరిపోదు టాలెంట్ కూడా ఉండాలంటూ కొందరు హీరోలతో పోల్చి చెప్పారు. ఇలా విజయ్ దేవరకొండ స్పీచ్ కు బండ్ల గణేష్ ట్వీట్ సింక్ అవడంతో విజయ్ ఫ్యాన్స్ బండ్ల గణేష్ తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే బండ్ల గణేష్ ఈ విధంగా విజయ్ దేవరకొండ పై ఇలాంటి ట్వీట్ చేయడానికి గల కారణం పూరి జగన్నాథ్, చార్మినే కారణమని తెలుస్తోంది.పూరి జగన్నాథ్ బండ్ల గణేష్ మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంది వీరిద్దరూ కలిసి ఎన్నో సినిమాలు చేశారు. అయితే లైగర్ సినిమా మొదలైనప్పటి నుంచి పూరి జగన్నాథ్ పూర్తిగా తన కుటుంబ బాధ్యతలను పక్కనపెట్టి ముంబైలో ఉంటున్నారు. పూరి జగన్నాథ్ నటి ఛార్మితో కలిసి ఈ సినిమా పనులలో భాగం కావడం బండ్ల గణేష్ జీర్ణించుకోలేకపోయారు.

ఈ క్రమంలోనే చోర్ బజార్ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకలో భాగంగా పరోక్షంగా పూరి జగన్నాథ్ చార్మిల రిలేషన్ గురించి ఈయన మాట్లాడుతూ కౌంటర్ వేశారు. అయితే వీరిద్దరి టీం లో విజయ్ దేవరకొండ కూడా జాయిన్ కావడమే అందుకు కారణమని, పూరి జగన్నాథ్ చార్మిలను టార్గెట్ చేస్తూ బండ్ల గణేష్ విజయ్ దేవరకొండ స్పీచ్ పై స్పందిస్తూ ఈ విధమైనటువంటి ట్వీట్ చేశారని తెలుస్తోంది. ఏది ఏమైనా బండ్ల గణేష్ ట్వీట్ మాత్రం ప్రస్తుతం సంచలనంగా మారింది.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus