సూర్య ‘బందోబస్త్’ కు సెన్సార్ టాక్ ఎలా ఉందంటే..?

ఎంత మాస్ ఫాలోయింగ్ ఉన్నా, యూత్, ఫ్యామిలీస్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నా.. ప్రయోగాత్మక చిత్రాల్నే చేస్తూ ముందుకు సాగుతున్నాడు సూర్య. ఫలితం ఎలా ఉన్నా సరే రొటీన్ సినిమాలు మాత్రమే చేసేసి సేఫ్ గేమ్ ఆడెయ్యాలని అస్సలు ప్రయత్నించడు. లుక్ విషయంలో కూడా ప్రతీ సినిమాకి వేరియేషన్స్ చూపించడంలో సూర్య ముందుంటాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. తమిళ హీరో అయినప్పటికీ తెలుగులో కూడా ఆయనకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే చాలా కాలం నుండీ ఆయనకీ సరైన హిట్టు లేదు. తెలుగులో ఆయన మార్కెట్ చాలా వరకూ పడిపోయింది. ఇలాంటి తరుణంలో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ‘బందోబస్త్’ తో వస్తున్నాడు. కెవి.ఆనంద్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందింది.

సెప్టెంబర్ 20 న ఈ చిత్రం విడుదల కాబోతుంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కోలీవుడ్ హీరో ఆర్య కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ చిత్రం తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. యాక్షన్ సీన్స్ ప్రేక్షకుల్ని మంచి థ్రిల్ చేసే విధంగా ఉన్నాయని సెన్సార్ సభ్యులు చెబుతున్నారు. ఈ చిత్రానికి ఎటువంటి కట్స్ లేకుండా యూ/ఏ సర్టిఫికెట్ ను జారీ చేసారు. సూర్య, మోహన్ లాల్ కు మధ్య వచ్చే సీన్స్ చాలా బాగా వచ్చాయట. ‘బందోబస్త్’ నిడివి 165 నిమిషాలు కావడం మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. హారిస్ జయరాజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఓకే అనిపించినా పాటలు మాత్రం తెలుగు ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే విధంగా లేకపోవడం కూడా మైనస్ పాయింట్ అని చెప్పాలి.

మొత్తానికి ‘బందోబస్త్’ అయితే ఆకట్టుకునే విధంగానే ఉందట. గతంలో కెవి.ఆనంద్ – సూర్య కాంబినేషన్ లో వచ్చిన ‘వీడోక్కడే’ ‘బ్రదర్స్’ వంటి డిఫరెంట్ చిత్రాలు వచ్చాయి. ఇందులో ‘వీడోక్కడే’ పర్వాలేదనిపించింది.. తెలుగు ప్రేక్షకులకి ఈ చిత్రాన్ని ఇప్పటికీ చూస్తూనే ఉన్నారు. ఇక అదే ‘వాల్మీకి’ చిత్రం కూడా విడుదల కాబోతుండడంతో అదో మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ‘బందోబస్త్’ కు చాలా తక్కువ థియేటర్లు మాత్రమే దక్కాయి. ఈ చిత్రం తెలుగులో హిట్టవ్వడం సూర్యకు చాలా అవసరం. ఎందుకంటే ఇప్పటికే 15 కోట్ల సూర్య మార్కెట్ 7 కోట్లకు పడిపోయింది. ‘బందోబస్త్’ హిట్టయితేనే ఆ మార్కెట్ ను పెంచుకునే అవకాశం ఉంటుంది… లేదంటే కష్టమే..!

గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
పహిల్వాన్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus