Hema: హేమ గురించి బెంగళూరు పోలీస్ అలా రియాక్ట్ అయ్యారా.. ఏమైందంటే?

టాలీవుడ్ ప్రముఖ నటి హేమ (Hema) ఈ మధ్య కాలంలో ఒక వివాదంలో చిక్కుకోవడం ద్వారా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఆ వివాదాన్ని కవర్ చేసుకోవడానికి హేమ చేసిన ప్రయత్నాల విషయంలో భిన్నమైన అభిప్రయాలు వ్యక్తమయ్యాయి. అయితే హేమ తాను హైదరాబాద్ లోనే ఉన్నానంటూ చేసిన వీడియోల వల్లే ఆమె పేరు మరింత ఎక్కువగా వినిపించిందని ఆమె అలా ప్రచారం చేసుకోకపోతే కృష్ణవేణి అనే పేరు ఇవ్వడం వల్ల ఆమెకు ఇన్ని సమస్యలు అయితే వచ్చేవి కావని బెంగళూరు పోలీస్ ఒకరు కామెంట్ చేశారని తెలుస్తోంది.

మరోవైపు రేవ్ పార్టీ కేసులో నటి హేమకు మరోసారి నోటీసులు జారీ అయ్యాయి. జూన్ 1వ తేదీన విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులలో పేర్కొన్నారని సమాచారం అందుతోంది. జూన్ 1వ తేదీన అయినా హేమ విచారణకు హాజరు అవుతారో లేదో చూడాల్సి ఉంది. వైరల్ ఫీవర్ వల్ల ఈ నెల 27వ తేదీన హాజరు కావాల్సి ఉన్నా ఆమె హాజరు కాలేదనే సంగతి తెలిసిందే.

తప్పు చేయకపోవడానికి మేము దేవుళ్లం కాదు అంటూ హేమ తాజాగా మరో వీడియోను రిలీజ్ చేయగా ఆ వీడియో సైతం నెట్టింట వైరల్ అయింది. ఒకవేళ తప్పు చేసినా పొరపాటు జరిగినా ఆమె సారీ చెప్పొచ్చని అప్పుడు మనం చాలా ఫ్రెష్ గా ఉంటామని అదే సమయంలో అబద్ధం చెబితే కవర్ చేయడానికి 100 అబద్ధాలు ఆడాలని అందువల్ల 99.9 శాతం అబద్ధాలు ఆడకుండా ఉంటే బెటర్ అని ఆమె అన్నారు.

వైరల్ అవుతున్న వీడియో ఎప్పటి వీడియో అనే ప్రశ్నలకు జవాబులు దొరకాల్సి ఉంది. హేమ రాబోయే రోజుల్లో సినీ కెరీర్ ను ఎలా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది. హేమ కామెడీ టైమింగ్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. హేమ కెరీర్ పరంగా మరింత ఎదగాలని మరిన్ని విజయాలను అందుకోవాలని వివాదాల నుంచి బయటపడాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags