Nagarjuna: ఆర్ఆర్ఆర్ వాయిదా నాగార్జునకు కలిసొచ్చిందా?

నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన బంగార్రాజు సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుందని ఈ నెల 1వ తేదీన విడుదలైన టీజర్ ద్వారా నాగ్ స్పష్టం చేశారు. సంక్రాంతి సమయానికి ఈ సినిమా ఫస్ట్ కాపీ సిద్ధం కాదనే కామెంట్లు వినిపిస్తున్నా నాగార్జున మాత్రం సంక్రాంతి సీజన్ ను వదులుకుంటే నష్టపోతానని భావిస్తున్నట్టు బోగట్టా. రాధేశ్యామ్ మూవీ సంక్రాంతికే రిలీజవుతుందని ప్రకటనలు వస్తున్నా ఆ సినిమా రిలీజ్ డేట్ మారే అవకాశాలు ఉన్నాయి.

దేశంలో అంతకంతకూ పెరుగుతున్న కరోనా కేసుల వల్ల పెద్ద సినిమాల నిర్మాతలు మరోసారి తమ సినిమాల రిలీజ్ డేట్లను మార్చాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ జీ స్టూడియోస్ సంయుక్తంగా బంగార్రాజును నిర్మించగా ఈ సినిమా ఆంధ్ర హక్కులు 12 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యే ఛాన్స్ ఉందని గతంలో కామెంట్లు వినిపించాయి. అయితే ఆర్ఆర్ఆర్ వాయిదాతో ఈ సినిమాకు 18 కోట్ల రూపాయల ఆఫర్ వచ్చిందని సమాచారం. బంగార్రాజు సంక్రాంతి సీజన్ కు సరైన సినిమా కావడంతో డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమా హక్కులను ఎక్కువ రేట్లకు కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

థియేట్రికల్ హక్కుల ద్వారానే బంగార్రాజుకు 40 కోట్ల రూపాయల వరకు వచ్చే అవకాశం ఉండటంతో నిర్మాతలకు ఈ సినిమా భారీగా లాభాలను మిగిల్చే అవకాశం ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. తాజాగా విడుదలైన టీజర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. వరుస సక్సెస్ లతో జోరుమీదున్న కృతిశెట్టి బంగార్రాజు సినిమాతో మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకుంటారేమో చూడాల్సి ఉంది. అక్కినేని అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలను సాధిస్తుందో చూడాల్సి ఉంది.

2022 సంవత్సరం సంక్రాంతి బంగార్రాజుదే అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ నెల 15వ తేదీన ఈ సినిమా రిలీజయ్యే ఛాన్స్ ఉందని సమాచారం. బంగార్రాజు రిలీజ్ డేట్ కు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus