ఇండియాలో కోవిడ్-19 కేసుల భారీగా నమోదవుతున్న నేపథ్యంలో నార్త్ లో చాలా చోట్ల థియేటర్లను మూసేసారు. మరికొన్ని చోట్ల 50 శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే రన్ రవుతున్నాయి. తాజాగా ఏపిలో కూడా 50శాతం ఆక్యుపెన్సీతోనే థియేటర్లు రన్ చేయాలని అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ‘ఆర్.ఆర్.ఆర్’ ‘రాధే శ్యామ్’ వంటి పెద్ద సినిమాల విడుదల వాయిదా పడింది. దాంతో అందరి చూపు నాగార్జున- నాగ చైతన్య ల ‘బంగార్రాజు’ పైనే పడింది.
గతంలో వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయన’ కూడా సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ అయ్యింది. అందుకే దానికి సీక్వెల్ గా రూపొందుతోన్న ‘బంగార్రాజు’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రం సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా పూర్తయ్యాయి. 2 గంటల 40 నిమిషాల నిడివి గల ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ ను జారీ చేశారు సెన్సార్ సభ్యులు. ఇక ఈ చిత్రానికి సెన్సార్ సభ్యుల స్పందన ఇలా ఉంది..
“నాగార్జున ‘బంగార్రాజు’ పాత్రతో మళ్లీ మెస్మరైజ్ చేసాడు. ‘సోగ్గాడే చిన్ని నాయన’ కి మించి రెట్టింపు ఉత్సాహంతో పనిచేసాడు నాగార్జున. మరోపక్క నాగ చైతన్య కూడా ఏమాత్రం తగ్గలేదు. మునుపెన్నడూ చూడనంత ఎనర్జిటిక్ గా అతను కనిపించాడు. సినిమా ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా సాగింది. సెకండ్ హాఫ్ లో ఫ్యామిలీ ఆడియెన్స్ మెచ్చే అంశాలు అన్నీ ఉంటాయి.ఎమోషనల్ సీన్స్ కూడా అద్భుతంగా వచ్చాయి. పాటలన్నీ తెర పై చాలా బాగున్నాయి.
నాగార్జున- రమ్యకృష్ణ ల కామెడీ, కృతి శెట్టి గ్లామర్, ‘బంగార్రాజు’ మనవడు చిన బంగార్రాజుగా నాగ చైతన్య నటన కలగలిపి ఈ చిత్రాన్ని చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిలబెట్టడం ఖాయం” అంటూ వారు చెప్పుకొచ్చారు. మరి బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎంత వరకు రాబడుతుందో చూడాలి..!
Most Recommended Video
ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!