‘కింగ్’ నాగార్జున,యువసామ్రాట్ నాగ చైతన్య హీరోలుగా రమ్య కృష్ణ, కృతి శెట్టి.. హీరోయిన్లుగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బంగార్రాజు’. ‘జీ స్టూడియోస్’ ‘అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్’ బ్యానర్లు కలిసి నిర్మించిన ఈ చిత్రం 2016లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘సోగ్గాడే చిన్ని నాయన’ కి సీక్వెల్ గా తెరకెక్కింది.జనవరి 14న సంక్రాంతి కానుకగా ‘బంగార్రాజు’ విడుదలైన ‘బంగార్రాజు’ కి కాస్త మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఓపెనింగ్స్ బాగానే నమోదయ్యాయి.
కానీ ఆ తర్వాత మాత్రం ఆశించిన స్థాయిలో పెర్ఫార్మ్ చేయలేదు. కిందా మీదా పడి బ్రేక్ ఈవెన్ సాధించింది కానీ ‘సోగ్గాడే చిన్ని నాయన’ కలెక్షన్లను మాత్రం ఈ చిత్రం అధిగమించలేకపోయింది.
ఈ చిత్రం క్లోజింగ్ కలెక్షన్లను గమనిస్తే :
నైజాం
8.56 cr
సీడెడ్
7.88 cr
ఉత్తరాంధ్ర
5.28 cr
ఈస్ట్
4.20 cr
వెస్ట్
2.94 cr
గుంటూరు
3.62 cr
కృష్ణా
2.29 cr
నెల్లూరు
1.90 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
36.67 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్
3.38 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
40.05 cr
‘బంగార్రాజు’ చిత్రానికి రూ.38.31 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.39 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.40.05 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసుకుని హిట్ గా నిలిచింది కానీ … నైజాం, ఓవర్సీస్ వంటి ఏరియాల్లో మాత్రం ఈ మూవీ నష్టాలనే మిగిల్చింది. మొత్తంగా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రూ.1.05 కోట్ల వరకు లాభాలను అయితే అందించింది.
ఫిబ్రవరి 18న ఈ చిత్రం జీ5 లో విడుదలయ్యి అక్కడ కూడా దుమ్ము లేపుతుంది. ఏదేమైనా టాలీవుడ్లో సీక్వెల్స్ సక్సెస్ కావు అనే సెంటిమెంట్ ను అయితే ‘బంగార్రాజు’ తుడిచిపెట్టేసింది. ‘బాహుబలి'(సిరీస్) తర్వాత ఆ ఫీట్ ను సాధించిన మూవీ మాత్రం ఇదే అని చెప్పాలి.