సంక్రాంతి బరిలో నిలిచి హిట్ కొట్టాలని అనుకున్న అల్లరి నరేష్ అనుకోని విధంగా ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. బంగారు బుల్లోడు అనే కమర్షియల్ కామెడీ సినిమాతో మొదటిరోజూ కలెక్షన్స్ గట్టిగానే లాగుతాడాని అనుకుంటే చాలా నీరసంగా స్టార్ట్ చేశాడు. గత కొంతకాలంగా నరేష్ సినిమాలు ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటున్నాయో స్పెషల్ గా చెప్పనవసరం. మంచి టాలెంటెడ్ ఉన్న నటుడే అయినప్పటికీ సరైన సక్సెస్ అందడం లేదు.
తండ్రి ఈవివి.సత్యనారాయణ ఉన్నప్పుడు కొడుకు ప్లాప్ ఎదుర్కొన్నప్పుడల్లా ఎదో ఒక కామెడీ సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి తెచ్చేవాడు. ఆయన లేని లోటు కరెక్ట్ గా కనిపిస్తోంది. ఇప్పుడు ఎలాంటి సినిమా చేసినా వర్కౌట్ కావడం లేదు. ఇక బంగారు బుల్లోడు మొదటి రోజు దాదాపు 400కు పైగా థియేటర్స్ లో విడుదలయ్యింది. మొత్తం వచ్చిన గ్రాస్ కలెక్షన్స్ 1.1కోట్లు కాగా షేర్స్ 67లక్షలు మాత్రమే వచ్చాయి. హాలిడేస్ అయిపోయిన తరువాత రావడం కూడా సినిమాకు పెద్ద మైనస్ అని చెప్పవచ్చు.
ఇక ఆదివారం కలెక్షన్స్ ఏమైనా పెరుగుతాయో లేదో చూడాలి. అలాగే జనవరి 26న కూడా హాలిడే కాబట్టి ఆ రోజు కూడా చాలా ముఖ్యం. కలెక్షన్స్ ఇలానే కొనసాగితే మాత్రం భారీగా నష్టాలు ఎదుర్కొక తప్పదు. అల్లరి నరేష్ నెక్స్ట్ నాంది అనే సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే.
నైజాం | 21 L |
సీడెడ్ | 13 L |
ఉత్తరాంధ్ర | 11 L |
ఈస్ట్ | 6.1 L |
వెస్ట్ | 4.2 L |
కృష్ణా | 4 L |
గుంటూరు | 4.6 L |
నెల్లూరు | 3.3 L |
ఏపీ+తెలంగాణ టోటల్ | 0.67 cr (1.1cr Gross) |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 2 L |
ఓవర్సీస్ | 1 L |
టోటల్ వరల్డ్ వైడ్ : | 0.70 cr (1.15Cr Gross) |
Most Recommended Video
మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!