Bangladeshi Actress: ఇండియాలో అక్రమంగా నివాసముంటున్న నటి అరెస్ట్

ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. అందులో శ్రీలంకకు చెందిన ఫ్యామిలీ ఇండియాకు అక్రమంగా వచ్చి ఇక్కడ సెటిల్ అవ్వడానికి పడ్డ కష్టాలను చూపించారు. సినిమా కాబట్టి.. ఆ ఫ్యామిలీ అంతా మెయిన్ రోల్స్ చేశారు కాబట్టి.. జనాలకు సింపతీ కలిగింది.

Bangladeshi Actress

కానీ నిజ జీవితంలో అలా ఉంటే.. ఊహించని దారుణాలు చోటు చేసుకునే అవకాశం కూడా లేకపోలేదు.ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ సినిమాలో మాదిరి ఇండియాలో నివాసముంటున్న ఓ నటి, మోడల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళితే.. కోల్‌కతాలో నివసిస్తున్న ఓ మోడల్ అయిన శాంతా పాల్‌ను పోలీసులు అరెస్ట్ చేయడంతో దేశమంతా హాట్ టాపిక్ అయ్యింది. ఈమె అక్రమంగా ఇండియాకు వచ్చిందని, ఇక్కడ చాలా కాలం నుండి నివసిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఆమె వద్ద ఉన్న నకిలీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డు సైతం స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ పాస్‌ పోర్టులు, రీజెంట్ ఎయిర్‌ వేస్(బంగ్లాదేశ్) ఎంప్లాయ్మెంట్ కార్డు, ఢాకాలోని ఎడ్యుకేషన్ అడ్మిట్ కార్డు వంటి వాటిలో అడ్రెస్..లు వేర్వేరుగా ఉన్నాయి. దీంతో వెంటనే ఇండియాలో ఆమె క్రియేట్ చేసుకున్న ఆధార్ కార్డుతో సహా.. రేణు ఆధార్ కార్డులు పోలీసులను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆమె వద్ద వీసా వాలిడేట్ అయ్యే విధంగా లేదు అని పోలీసులు గుర్తించారు. దీంతో ఆగస్టు 8 వరకు శాంతాపాల్ ను పోలీసులు కస్టడీకి తరలించారు.

శాంతా పాల్ వయసు 28 ఏళ్లు. ఆమె ఒరిజినల్ గా బంగ్లాదేశ్‌లోని బారిసాల్‌కు చెందిన వ్యక్తి. అయితే ఇండియాకి అక్రమంగా చొరబడి కోల్‌కతాలోని జాదవ్‌పూర్ ప్రాంతంలో ఓ అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉంటుంది. అక్కడే ఆమె అరెస్ట్ అయినట్లు తెలుస్తుంది. ఆధార్ కార్డులతో పాటు ఓటరు కార్డు, రేషన్ కార్డు వంటివి కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు స్పష్టమవుతుంది

విజయ్ సైలెంట్ గా ఉన్నా నెగిటివిటీ ఆగడం లేదు.. ఈసారి ఎందుకు?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus