1మిలియ‌న్‌కి పైగా వ్యూస్‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోన్న ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’ చిత్రంలోని `కన్నులు చెదిరే.. లిరిక‌ల్ వీడియో సాంగ్‌

`కన్నులు చెదిరే అందాన్నె వెన్నెల తెరపై చూశానే.. కదిలే కాలాన్నే నిమిషం నిలిపేశానే… నన్నిక నీలో విడిచానే నిన్నలు గాల్లో కలిపానే…ఇపుడే ఇంకోలా నే మళ్ళీ పుట్టానే…నీ కురులా కెరంటంలో నా చూపులిలా మునిగినవేమో… చిక్కానే చేపై నే తీగ‌లులేని ఈ వ‌లలో నెమ్మ‌దిగా నువ్వొదిలే న‌వ్వుల గాలాల్లో…` అంటూ ఆహ్లాద‌క‌రంగా సాగే ఈ అంద‌మైన మెలొడి సాంగ్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ కేవి గుహన్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’ చిత్రంలోనిది. అదిత్‌ అరుణ్, శివాని రాజశేఖర్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని రామంత్ర క్రియేషన్స్ పతాకంపై డా. రవి పి. రాజు దాట్ల నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘‘కన్నులు చెదిరే…’లిరికల్ వీడియో సాంగ్ ను ఇటీవ‌ల `మేజ‌ర్‌` అడవి శేష్ రిలీజ్ చేసి సాంగ్ అద్భుతంగా ఉందంటూ ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’ టీమ్‌ని ప్ర‌శంసించిన విష‌యం తెలిసిందే.. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుద‌లైన ఈ పాట శ్రోత‌ల‌ని ఆక‌ట్టుకుంటూ యూట్యూజ్‌లో 1 మిలియ‌న్‌కి పైగా వ్యూస్ ని సాధించి సినిమాపై అంచనాల‌ను మ‌రింత పెంచింది. అనంత శ్రీరామ్‌ లిరిక్స్‌ అందించిన ఈ గీతాన్ని యాజిన్‌ నిజార్‌ ఆలపించారు. సైమన్‌ కె కింగ్‌ స్వరాలు సమకూర్చారు.. ఈ సంద‌ర్భంగా..

చిత్ర నిర్మాత డా. రవి పి.రాజు దాట్ల మాట్లాడుతూ – “మా రామంత్ర క్రియేష‌న్స్ బేన‌ర్‌లో రూపొందుతోన్న ఫ‌స్ట్ మూవీ ఇది. అలాగే ఫస్ట్‌ కంప్యూటర్‌ స్క్రీన్‌ తెలుగు మూవీ. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్, నైలున‌ది, లాక్‌డౌన్ ర్యాప్‌ సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా `మేజ‌ర్` అడివిశేష్‌గారు రిలీజ్ చేసిన `కన్నులు చెదిరే..` లిరిక‌ల్ వీడియో సాంగ్ యూట్యూబ్‌లో 1 మిలియ‌న్‌కి పైగా ఆర్గానిక్ వ్యూస్‌ని సొంతం చేసుకోవ‌డం చాలా సంతోషంగా ఉంది. ఈ సంద‌ర్భంగా ఈ పాట విడుద‌ల చేసిన అడివిశేష్ గారికి మ‌రియు ఆదిత్య మ్యూజిక్ వారికి మా రామంత్ర క్రియేష‌న్స్ త‌ర‌పున ప్ర‌త్యేక‌మైన ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాం. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. ఈ కరోనా పరిస్థితులు చక్కబడిన వెంటనే విడుదల తేదీని ప్రకటిస్తాం “ అన్నారు.

అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ చక్కగా నటించారు. గుహ‌న్ గారు ఈ సినిమాని అద్బుతంగా తెర‌కెక్కించారు. తప్పకుండా ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంద‌ని న‌మ్మ‌కం ఉంది“ అన్నారు

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus