Bellamkonda Sreenivas: బాలీవుడ్ పై ప్రశంసలు కురిపించిన బెల్లంకొండ శ్రీనివాస్!

  • May 13, 2023 / 03:06 PM IST

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అల్లుడు శ్రీను సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. బెల్లంకొండ సురేష్ బాబు కుమారుడిగా ఇండస్ట్రీ హీరోగా పరిచయమైనటువంటి సినిమాలలో నటించిన పెద్దగా సక్సెస్ సాధించలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ కానటువంటి ఈ హీరో బాలీవుడ్ ఇండస్ట్రీలో తన సత్తా నిరూపించుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే చత్రపతి సినిమా రీమేక్ ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తెలుగులో నటించిన సినిమాలన్నీ కూడా హిందీలో డబ్ అయ్యి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

ఇలా హిందీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈ హీరో ఏకంగా రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన చత్రపతి సినిమాని హిందీలో రీమేక్ చేశారు. ఈ సినిమా మే 12 వ తేదీ విడుదల అయ్యి మిశ్రమ స్పందన అందుకుంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన బాలీవుడ్ ఇండస్ట్రీ గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నేను ఇప్పటివరకు నటించిన తెలుగు సినిమాలన్నింటిని హిందీ ప్రేక్షకులు ఆదరించారు.

అందుకే తాను (Bellamkonda Sreenivas) పూర్తిస్థాయి హిందీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావాలన్న ఉద్దేశంతోనే చత్రపతి సినిమా చేశానని తెలిపారు. ఎంతోమంది సినీ సెలెబ్రెటీలు దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు దగ్గర కావాలని కోరుకుంటారు. ఇలా ప్రేక్షకులకు దగ్గర కావాలంటే హిందీ సినిమా ఒక్కటే మార్గమని తెలిపారు.టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది సెలబ్రిటీలు ఇక్కడ మంచి సక్సెస్ సాధించారు.

బీ టౌన్ లో కూడా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. నేను కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతానని సాయి శ్రీనివాస్ తెలిపారు. తాను నటించిన సినిమాలకు గాను 2015 వ సంవత్సరంలో ఉత్తమ నటుడుగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నాను. ఈ సినిమాకు కూడా అందుకుంటానని భావిస్తున్నాను అంటూ శ్రీనివాస్ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus